(1 / 7)
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన సినిమా ఎంపికలతోనే కాకుండా తన ఫిట్‌నెస్ జర్నీతో కూడా చాలా వార్తల్లో నిలుస్తోంది. సాంప్రదాయ దుస్తులు, మోడ్రన్ లేదా బికినీ ఏదైనా సరే ఈ అమ్మడి అందాల ఆరబోత చూడముచ్చటగా ఉంటుంది. అనన్య పాండే తన బాడీని ఎలా ఫిట్‌గా ఉంచుకుంటుందో, పేగులను శుభ్రం చేసే డైట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 7)
అనన్య పాండే ఫిట్ నెస్ సీక్రెట్: 26 ఏళ్ల అనన్య పాండే బరువు పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పిజ్జా, ఐస్ క్రీమ్ తినడానికి ఏమాత్రం వెనుకాడదు. అయితే ప్రధానంగా పేగులను శుభ్రపరిచే (గట్ క్లీనింగ్) ఆహారాలను అనన్య తింటుంది.
(Image Credit: PTI)(3 / 7)
"నేను గత కొన్ని నెలలుగా ప్రేగు ప్రక్షాళన (గట్ క్లీనింగ్) ఆహారాన్ని అనుసరిస్తున్నాను, ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇది నా జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చింది" అని బ్యూటిఫుల్ అనన్య పాండే చెప్పింది. రాత్రి 7 గంటలకు డిన్నర్ చేసే అనన్య పాండే ఆ తర్వాత ఏమీ తినదట.
(Image Credit: SUJIT JAISWAL / AFP)(4 / 7)
వివిధ ఆహారాలు తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై తాను మరింత జాగ్రత్తగా ఉంటానని హీరోయిన్ తెలిపింది. నాలుకకు సరిపోని లేదా రుచిగా ఉండే ఆహారాన్ని వదులుకోవడం నిజంగా సహాయపడిందని అనన్య వివరించింది.
(Image Credit: PTI)(5 / 7)
పేగు ప్రక్షాళన ఆహారం అంటే ఏమిటి?: పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ గట్‌ను శుభ్రపరచడానికి శరీరానికి దాని సొంత వ్యవస్థ ఉందని వివరించారు. గట్ ఆరోగ్యంగా ఉండటానికి, ప్రీబయోటిక్స్ జోడించడం, సహజంగా ప్రోబయోటిక్ ఆహారం తినడం చాలా అవసరం. సలాడ్లు, పండ్లు, పులియబెట్టిన ఆహారాలు తినడం వల్ల ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి నిర్విషీకరణకు సహాయపడతాయి. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పుష్కలంగా నీరు త్రాగటం వల్ల గట్ శుభ్రంగా ఉంటుంది.
(Image Credit: PTI)(6 / 7)
అరటిపండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆస్పరాగస్, చికోరీ రూట్స్, ఓట్స్, ఆపిల్స్, లీక్స్, పెరుగు, మిస్సో, బార్లీ వంటివి ప్రీబయోటిక్స్‌కు మంచి వనరులు. వీటిని తీసుకోవడం వల్ల ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఏది తిన్న, ఎంత తిన్న ఈ గట్ క్లీనింగ్ డైట్‌ను ఫాలో అయితే బరువు పెరిగే సమస్య తప్పుతుందని లైగర్ హీరోయిన్ అనన్య పాండే చెప్పుకొచ్చింది.
(Image Credit: AFP)(7 / 7)
గమనిక: ఈ సమాచారం జనరల్ నాలెడ్జ్, ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే సమాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఈ విషయాన్ని పూర్తిగా కచ్చితమైనదిగా చెప్పదు. ఈ అంశంపై కచ్చితమైన సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.
ఇతర గ్యాలరీలు