తెలుగు న్యూస్ / ఫోటో /
Team India Cricketers: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో టీమిండియా క్రికెటర్లు - అనన్య పాండేతో హార్దిక్ పాండ్య స్టెప్పులు
Team India Cricketers: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం శనివారం అంగరంగవైభవంగా జరిగింది. ముంబైలోని జియో కన్వేషన్ సెంటర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో టీమిండియా క్రికెటర్లు పాల్గొన్నారు.
(1 / 5)
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అటెండ్ అయ్యాడు. ఇటీవలే టీమిండియా కోచ్‌గా గంభీర్ అపాయింట్ అయ్యాడు.
(2 / 5)
అంబానీ పెళ్లి వేడుకల్లో ధోనీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తన భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ఫొటోలకు ధోనీ ఫోజులిచ్చాడు. ట్రెడిషనల్ లుక్‌లో ధోనీ కనిపించాడు.
(3 / 5)
టీమిండియా పేసర్ బుమ్రా...తన భార్య సంజనా గణేషన్‌తో కలిసి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు.
(4 / 5)
అనంత్ అంబానీ పెళ్లిలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి డ్యాన్స్ చేశారు. హార్దిక్, అనన్య డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు