(1 / 8)
ఒక్క చిన్న వీడియో క్లిప్ వైరల్ అయితే చాలు అమ్మాయిలకు విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంటుంది. ఇప్పుడు తాజాగా అలాంటి ఫాలోయింగ్, క్రేజ్‌ను సొంతం చేసుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనఘా రవి.
(2 / 8)
ప్రేమలు హీరో నస్లెన్ కే గఫూర్ నటించిన లేటెస్ట్ సినిమా అళపుజ జింఖానా. ఈ సినిమాలో 20 ఏళ్ల బాక్సర్ నటాషా పాత్రలో అనఘా రవి యాక్ట్ చేసింది. జింఖానా ట్రైలర్‌లో అనఘా రవి చేసిన బాక్సింగ్ మూమెంట్స్, పంజర పంచ్ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
(3 / 8)
దీంతో అనఘా రవి ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో అనఘా రవి బాక్సింగ్ వీడియోలు, గ్లామర్ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి అనఘా రవి నటించిన సినిమాలు, ఆమె అసలు పేరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
(4 / 8)
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనఘా రవి అసలు పేరు అనఘా మాయ రవి. అనఘా తల్లిదండ్రులు కుట్టి కృష్ణన్, లీల ఇద్దరు రిటైర్ టీచర్స్. కాలికట్‌లోని గోకులం పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ కంప్లీట్ చేసింది అనఘా రవి.
(5 / 8)
జింఖానా సినిమాతో తెగ క్రేజ్ తెచ్చుకున్న అనఘా రవి దానికంటే ముందుగా మలయాళంలో మూడు సినిమాలు చేసింది. అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ జ్యోతిక నటించిన ది కాథల్ కోర్ మూవీలో వారితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందులో వారికి కూతురుగా నటించింది అనఘా రవి.
(6 / 8)
ది కాథల్ కోర్ తర్వాత ది అదర్ సైడ్ అనే మరో మలయాళ సినిమా చేసింది అనఘా రవి. అలాగే, న్యూ నార్మల్ అనే మరో చిత్రంలో యాక్ట్ చేసింది అనఘా రవి. ఇప్పుడు జింఖానా సినిమాతో అనఘా మాయ రవి మరిన్ని సినీ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
(Instagram/Anagha Ravi)
(7 / 8)
ఇక సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోన్న బాక్సింగ్ బ్యూటి అనఘా రవి ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. బికినీలో ఉన్న అనఘా రవి ఫొటోలపై నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
(Instagram/Anagha Ravi)ఇతర గ్యాలరీలు