అదిరిపోయేలా అమృత్‌భారత్‌ రైల్వే స్టేషన్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ-amrit bharat railway stations inaugurated virtually by pm narendra modi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అదిరిపోయేలా అమృత్‌భారత్‌ రైల్వే స్టేషన్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

అదిరిపోయేలా అమృత్‌భారత్‌ రైల్వే స్టేషన్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Published May 22, 2025 11:28 AM IST Sarath Chandra.B
Published May 22, 2025 11:28 AM IST

దేశంలో అమృత్‌ భారత్‌ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్‌, వరంగల్‌ రైల్వే స్టేషన్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశ వ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను రాజస్థాన్‌ నుంచి వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. తెలంగాణ స్టేషన్లలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 108 రైల్వే స్టేషన్లలో అమృత్‌భారత్‌ స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

(1 / 10)

(HT_PRINT)

కరీంనగర్‌‌లో ఆధునీకీకరించిన రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పాల్గొన్నారు. రాజస్థాన్‌ నుంచి వర్చువల్‌గా ప్రధాని మోదీ  అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లను లాంఛనంగా ప్రారంభించారు.

(2 / 10)

తెలంగాణలో  40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో  పునరాభివృద్ధి పనులు  చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లను గురువారం ప్రధాని  ప్రారంభించారు.

(3 / 10)

బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి  పాల్గొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి చేపట్టినట్టు కిషన్‌ రెడ్డి వివరించారు.

(4 / 10)

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300 కు పైగా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు, 2023 లో ప్రారంభించారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వేస్టేషన్లను సిద్ధం చేయనున్నారు. వీటిలో తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.2,750 కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు  వేగంగా సాగుతున్నాయి.

(5 / 10)

బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పునరాభివృద్ధి పనులు జరుగుతున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముఖద్వారం, స్టేషన్ ప్రధాన భవనాల నిర్మాణం సాగుతోంది.

(6 / 10)

తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ అని కిషన్‌ రెడ్డి వివరించారు.

(7 / 10)

స్టేషన్ లోపల ప్రయాణికులకు అనువుగా ఫుట్‌పాత్‌లు, విశాలమైన ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైనేజ్ బోర్డుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

(8 / 10)

 రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.  ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా  అభివృద్ధి పనులు సాగుతున్నాయి. బేగంపేట రైల్వేస్టేషన్‌ను ఇకపై పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్నారు.

(9 / 10)

అమృత్‌భారత్‌ స్కీంలో భాగంగా ఆధునీకరించిన వరంగల్‌ రైల్వే టెర్మినల్‌‌ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మంత్రులు పొన్నం, పొంగులేటి, పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

(10 / 10)

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు