
(1 / 6)
ప్రైమ్ వీడియో టాప్ 10: అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారతదేశంలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో హారర్ థ్రిల్లర్ సిరీస్ నెంబర్ వన్ ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది.
(IMDb)
(2 / 6)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 1లో ఉన్న సిరీస్ అంధేరా. ఇదొక హారర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌కు ఐఎండీబీ నుంచి 6.8 రేటింగ్ ఉంది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే సిరీస్ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
(IMDb)
(3 / 6)
ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలుగు, తమిళ భాషా వెబ్ సిరీస్ అరేబియా కడలి ఉంది. ఇదొక సర్వైవల్ డ్రామా సిరీస్. ఈ సిరీస్‌కు ఐఎండీబీ రేటింగ్ 6.5గా ఉంది. హీరో సత్యదేవ్, హీరోయిన్ ఆనంది జంటగా నటించిన సిరీస్ ఇది. ఈ సిరీస్ కథ దాదాపుగా నాగ చైతన్య తండేల్ మూవీకి దగ్గరిగా ఉంటుంది.
(IMDb)
(4 / 6)
రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ది సమ్మర్ ఐ టర్న్ ప్రెటీ. ఇది ప్రైమ్ వీడియోలో టాప్ 6 ఓటీటీ ట్రెండింగ్‌లో ఉంది. అమెరికన్ రొమాంటిక్ డ్రామా సిరీస్‌లో మొత్తం మూడు సీజన్లు ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఐఎండీబీ రేటింగ్ 7.3గా ఉంది. ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
(IMDb)
(5 / 6)
అమెజాన్ ప్రైమ్ నేటి ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో బటర్‌ఫ్లై సిరీస్ ఉంది. అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ బటర్‌ఫ్లై ఐదో స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఐఎండీబీ నుంచి 6.8 రేటింగ్ సాధించిన ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో ఉంది.
(IMDb)
(6 / 6)
మోస్ట్ పాపులర్ హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ 8వ స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 9గా ఉంది. ఇక రెండు, ఏడు స్థానాల్లో హౌజ్ ఫుల్ 5, 3వ స్థానంలో 3 బీహెచ్‌కే, 9వ ప్లేసులో కుబేరా, పదో స్థానంలో జైలర్ సినిమాలు ఉన్నాయి. ఇవాళ ప్రైమ్ వీడియోలోని టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, సిరీసుల్లో 7 తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
(IMDb)ఇతర గ్యాలరీలు