TG Governor Meets Chandrababu : సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ, విభజన సమస్యలపై చర్చ!
- TG Governor Meets Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో విభజన సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.

(1 / 6)
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
(2 / 6)
ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు, గవర్నర్ రాధాకృష్ణన్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయనను సత్కరించారు.
(3 / 6)
సుమారు రెండు గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సమావేశం అయ్యారు. పెండింగులో ఉన్న విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
(4 / 6)
సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిన అనంతరం ఇంద్రకీలాద్రి కనకదుర్మ అమ్మవారిని గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు.
(5 / 6)
తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు దుర్గగుడి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం గవర్నర్ కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని అందించారు.
ఇతర గ్యాలరీలు