తెలుగు న్యూస్ / ఫోటో /
PM Surya Ghar Muft Bijli Yojana : పీఎం సూర్య ఘర్ స్కీమ్ లో రూ.78 వేల రాయితీ-దరఖాస్తు విధానం, అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే?
- PM Surya Ghar Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని వెల్లడించింది.
- PM Surya Ghar Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని వెల్లడించింది.
(1 / 10)
దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.75,021 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని వెల్లడించింది.
(2 / 10)
ఈ పథకం ద్వారా 2 kW సిస్టమ్‌లకు ఖర్చులో 60%, 2 నుంచి 3 kW మధ్య సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు ఖర్చులో 40% కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రస్తుత బెంచ్‌మార్క్ ధరల ప్రకారం 1 kW సిస్టమ్‌కు రూ. 30,000, 2 kW సిస్టమ్‌లకు రూ. 60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌లకు రూ. 78,000 సబ్సిడీగా(PM Surya Ghar Muft Bijli Yojana Subsidy) కేంద్రం అందిస్తుంది. మిగత వ్యయాన్ని వినియోగదారుడు తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం పొందవచ్చు.
(3 / 10)
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన లబ్దిదారులుగా చేరాలంటే ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ వెబ్ సైట్ లో ఈ స్కీమ్ కు ఇలా అప్లై చేసుకోవచ్చు.(PM Surya Ghar Muft Bijli Yojana Apply)
(4 / 10)
Step 1 -ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ లో 'Apply for Rooftop Solar' పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ విద్యుత్ పంపిణీ సంస్థ, కరెంట్ బిల్లు నెంబర్, మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి.
(5 / 10)
Step 2- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత- మీ కన్స్యూమర్(కరెంట్ బిల్లు) నెంబరు, మొబైల్ నెంబరులతో లాగిన్ అవ్వండి. ఫారంలో పేర్కొన్న విధంగా వివరాలు నమోదు చేసి రూఫ్ టాప్ సోలార్(Rooftop Solar) కోసం దరఖాస్తు చేయండి.(Image Source : Pixabay )
(6 / 10)
Step 3- మీ డిస్కామ్(DISCOM) అధికారుల ఆమోదం కోసం వేచి ఉండండి. మీ దరఖాస్తు ఆమోదం పొందగానే ఆ విషయాన్ని మీకు మెయిల్ లేదా మెసేజ్ ద్వా తెలియజేస్తారు. (Image Source : Pixabay )
(7 / 10)
Step 4 - ఇన్ స్టలేషన్ పూర్తయిన తరువాత, ప్లాంట్ వివరాలను సబ్మిట్ చేయండి. నెట్ మీటర్ కోసం అప్లై చేయండి(Image Source : Pixabay )
(8 / 10)
Step 5- నెట్ మీటర్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత డిస్కం అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తరువాత పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్ చెక్కును పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ అమౌంట్ జమ అవుతుంది. (Image Source : Pixabay )
(9 / 10)
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana eligibility Eligibility)పథకానికి అర్హులు- ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు భారత పౌరులై ఉండి 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. మధ్యతరగతి, దిగువ తరగతి ఆదాయ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అన్ని కులాలకు చెందిన వారు PM-SGMBY పథకానికి అర్హులు. ఈ పథకానికి అర్హులు కావాలంటే ప్రజలు తమ ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. (Image Source : Pixabay )
ఇతర గ్యాలరీలు