Amaravati Capital : అమరావతి రాజధాని పనులు ప్రారంభానికి డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతంటే?-amaravati capital works starts from december 1st 60k crore budget allocation needed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Amaravati Capital : అమరావతి రాజధాని పనులు ప్రారంభానికి డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతంటే?

Amaravati Capital : అమరావతి రాజధాని పనులు ప్రారంభానికి డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతంటే?

Aug 25, 2024, 03:32 PM IST Bandaru Satyaprasad
Aug 25, 2024, 03:31 PM , IST

  • Amaravati Capital : అమరావతి పనులు పునః ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్1 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రూ.60 వేల కోట్లతో చేపట్టే నిర్మాణాలను 4 ఏళ్ల లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి పనులు పునః ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.  రాజధాని పరిధిలోని అన్ని నిర్మాణాల పనులు 4 సంవత్సరాలలోపు పూర్తిచేసేందుకు ప్రణాళిక చేస్తుంది. ఐఐటీ మద్రాస్, హైదరాబాద్ నిపుణులు అమరావతి రాజధానిపై నివేదికను వచ్చే వారంలో సమర్పించే అవకాశం ఉంది. 

(1 / 6)

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా... శాసనసభ భవనం, హైకోర్టు, సెక్రటేరియట్ భవనం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలిండియా అధికారులు, ఇతర అధికారుల కోసం గృహ సముదాయాలు, రాజధాని నగర రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించడం, మురుగు నీటి కాలువలు, వరద కాలువలు, పార్కులు, వినోద కేంద్రాలు/పర్యాటక ప్రాజెక్టులు, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అమరావతి రాజధాని ప్రాజెక్టులను అమరావతిలో మాత్రమే కాకుండా, విజయవాడ, మంగళగిరి, గుంటూరులోని సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించనున్నారు.  

(2 / 6)

ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రూ.60 వేల కోట్ల వ్యయంతో చేపట్టే నిర్మాణాలను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు.  మధ్య ఆగిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. 

(3 / 6)

అమరావతి రాజధానికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని అందించేలా బ్లూ, గ్రీన్‌ కాన్సె్‌ప్ట్ తో టూరిస్ట్ ప్రాజెక్టులను చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. శనివారం మంత్రి నారాయణ, అధికారులు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాజధానిలో 4 పెద్ద పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 6 నెలల్లో మెగా పార్కులను అందుబాటులోకి తెస్తామన్నారు.  

(4 / 6)

శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్‌ పార్కు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ మహానగరాన్ని పచ్చదనంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఓ సీనియర్‌ అధికారికి అమరావతిలో ప్రాజెక్టుల అభివృద్ధి బాధ్యతలను అప్పగించామన్నారు. శాఖమూరు, అనంతవరం, నీరుకొండలో సుందరమైన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి టూరిస్ట్ కేంద్రం తీర్చిదిద్దుతామన్నారు. శాఖమూరు సెంట్రల్‌ పార్కులో బోటింగ్‌కు 50 ఎకరాల్లో రిజర్వాయర్‌ను నిర్మిస్తామన్నారు. నీరుకొండలో 500 ఎకరాల్లో వాటర్‌ లేక్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

(5 / 6)

అనంతవరంలో 35 ఎకరాల్లో ఉద్యానవనం, రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్క్ నిర్మాస్తామని మంత్రి నారాయణ తెలిపారు.  నిలిచిపోయిన రాజధాని నిర్మాణాలపై ఐఐటీ మద్రాస్‌, హైదరాబాద్‌ బృందాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టాయని,  సెప్టెంబరు మొదటి వారంలో నివేదిక ఇస్తాయని చెప్పారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు