AP Rains Alert : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వచ్చే 4 రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!-amaravati asdma announced depression formed in south west bay of bangal next 4 days rains in ap ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rains Alert : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వచ్చే 4 రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

AP Rains Alert : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వచ్చే 4 రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

May 21, 2024, 07:39 PM IST Bandaru Satyaprasad
May 21, 2024, 07:39 PM , IST

  • AP Rains Alert : రేపు(మే 22) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మే 24వ తేదీ ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రేపు(మే 22) నైరుతిబంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మే 24వ తేదీ ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

(1 / 6)

నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రేపు(మే 22న) అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం శుక్రవారం ఉదయానికి వాయుగండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.  

(2 / 6)

మే 23 గరువారం - పార్వతీపురం మన్యం, అల్లురి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లురు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

(3 / 6)

మే 24 శుక్రవారం - అల్లురి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

(4 / 6)

మే 24 శుక్రవారం - అల్లురి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి,
పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

మే 25,శనివారం : శ్రీకాకుళం, విజయనగరం, పారవతీపురం మన్యం, అల్లురి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  

(5 / 6)

ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు బహిరంగ ప్రదేశాల్లో  ఉండరాదని సూచించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి అనంతపురం జిల్లా నార్పల 26.5 మిమీ, చిత్తూరు జిల్లాలో 22.5 మిమీ, అనంతపురం బీకేసముద్రంలో 22 మిమీ, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 21.5 మిమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. 

(6 / 6)

ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు బహిరంగ ప్రదేశాల్లో  ఉండరాదని సూచించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి అనంతపురం జిల్లా నార్పల 26.5 మిమీ, చిత్తూరు జిల్లాలో 22.5 మిమీ, అనంతపురం బీకే
సముద్రంలో 22 మిమీ, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 21.5 మిమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు