Pushpa 2 Record: కలెక్షన్లలో పుష్ప 2 బ్రేక్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే! అన్నీ అల్లు అర్జున్ తర్వాతే!
Pushpa 2 The Rule Collection Breaks Bollywood Movies Record: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ తొలి రోజున హిందీలో రూ. 72 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్‌లో ఓపెనింగ్ డేకి 50 కోట్ల క్లబ్‌లో చేరిన పుష్ప 2 మూవీ 7 హిందీ సినిమాలను బ్రేక్ చేసింది. అవేంటో లుక్కేద్దాం.
(1 / 9)
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క హిందీలోనే రూ. 72 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ దాటడమే కాకుండా పుష్ప 2 బ్రేక్ చేసిన 8 సినిమాలను ఇక్కడ చూద్దాం.
(2 / 9)
తొలిరోజు 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూ.72 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది.
(3 / 9)
షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' మొదటి రోజు రూ.65.50 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా నెంబర్ వన్‌గా ఉన్న ఈ సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేసి ఆస్థానంలోకి పుష్ప 2 చేరింది.
(4 / 9)
శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన కామెడీ హారర్ సినిమా 'స్త్రీ 2' తొలిరోజు రూ.55.40 కోట్లు రాబట్టింది. అంటే, ఈ సినిమాను కూడా దాటేసింది పుష్ప 2 ది రూల్.
(5 / 9)
షారుఖ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ 'పఠాన్' కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత కింగ్ ఖాన్ మళ్లీ వెండితెరపైకి రావడాన్ని చూసేందుకు థియేటర్ల వద్ద భారీ జనసందోహం నెలకొంది. ఈ చిత్రం మొదటి రోజు రూ.55 కోట్లు రాబట్టగా దీన్ని పుష్పరాజ్ బ్రేక్ చేశాడు.
(6 / 9)
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' కేజీఎఫ్ 2 హిందీ కలెక్షన్స్ అధిగమించి వసూళ్ల పరంగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే, హిందీలో మొదటి రోజు యానిమల్ రూ. 54.75 కోట్లు రాబట్టింది.
(7 / 9)
యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ ను చూసేందుకు తొలిరోజు చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు చేరుకున్నారు, దాంతో ఈ సినిమాకు రూ.53.95 కోట్లు వచ్చాయి. కేజీఎఫ్ 2, యానిమల్ రెండు సినిమాల రికార్డ్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది.
(8 / 9)
కరోనాకు ముందు హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' చిత్రం కూడా అద్భుతమైన ఆరంభాన్ని సాధించి తొలిరోజు రూ. 51.60 కోట్లు వసూలు చేసింది.
(9 / 9)
అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రీనా కైఫ్ వంటి బాలీవుడ్ స్టార్స్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమా ఫ్లాప్ అయింది. కానీ, భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు తొలిరోజు రూ. 50.75 కోట్లు వచ్చాయి. ఇలా హిందీలో కలెక్షన్స్‌తో సత్తా చాటిన సినిమాల కలెక్షన్స్ అన్నింటిని బ్రేక్ చేసి దుమ్ముదులిపింది పుష్ప 2.
ఇతర గ్యాలరీలు