Allu Arjun Sankranthi Celebrations: ఫ్యామిలీతో కలిసి సంతోషంగా సంక్రాంతి జరుపుకున్న అల్లు అర్జున్: ఫొటోలు
- Allu Arjun Sankranthi Celebration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. ఈ ఫొటోలను స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- Allu Arjun Sankranthi Celebration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. ఈ ఫొటోలను స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(1 / 6)
పుష్ప 2: ది రూల్ సినిమాతో చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. భారీ బ్లాక్‍బస్టర్ సాధించారు. అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కులను కూడా ఎదుర్కొన్నారు. నేడు (జనవరి 14) తన కుటుంబంతో కలిసి సంక్రాంతిని జరుపుకున్నారు అల్లు అర్జున్.
(2 / 6)
భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో కలిసి సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు అల్లు అర్జున్. వైట్ కలర్ కుర్తా పైజామా ధరించి ట్రెడిషనల్ లుక్‍లో కనిపించారు.
(3 / 6)
కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు అల్లు అర్జున్. ఈ ఫొటోలో అయాన్ కిస్ చేస్తున్నట్టుగా ఫేస్ పెట్టాడు.
(4 / 6)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు స్నేహా రెడ్డి. హ్యాపీ సంక్రాంతి అంటూ క్యాప్షన్‍తో శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేన్స్ ఫొటోలు చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ ఫొటోలకు లైక్‍లు, కామెంట్లు భారీగా వస్తున్నాయి.
(5 / 6)
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమా 2024 డిసెంబర్ 5న రిలీజైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. చాలా రికార్డులను బద్దలుకొట్టేసింది. భారీ అంచనాలను అందుకొని దుమ్మురేపోతోంది.
(6 / 6)
పుష్ప 2 ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు గాయపడ్డారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఓ రోజు జైలులో ఉన్నారు. మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. ఇటీవలే ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను ఆయన ఇటీవలే కలిసి, పరామర్శించారు అల్లు అర్జున్.
(PTI)ఇతర గ్యాలరీలు