మైసూరు దసరా ఉత్సవాల్లో ఈ గజరాజులే ప్రత్యేకం!-all you need to know about elephants taking part mysuru dasara ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మైసూరు దసరా ఉత్సవాల్లో ఈ గజరాజులే ప్రత్యేకం!

మైసూరు దసరా ఉత్సవాల్లో ఈ గజరాజులే ప్రత్యేకం!

Aug 22, 2024, 12:00 PM IST Sharath Chitturi
Aug 22, 2024, 12:00 PM , IST

  • మైసూరు దసరా ఉత్సవాల హడావుడి మొదలైంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి ఏనుగులు మైసూరుకు చేేరుకుంటున్నాయి. ప్రస్తుతం 10 ఏనుగులు మైసూరు వెళ్లాయి. వాటి విశేషాలను చూసేయండి..

కొడగులోని దుబారే, నాగరహోళే నుంచి ఏనుగులు ఇప్పటికే దసరా ఉత్సవాలు 2024లో పాల్గొనేందుకు మైసూరుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొమ్మిది ఏనుగులు వచ్చాయి. రెండో దశలో మరో ఐదు ఏనుగులు రానున్నాయి. 

(1 / 10)

కొడగులోని దుబారే, నాగరహోళే నుంచి ఏనుగులు ఇప్పటికే దసరా ఉత్సవాలు 2024లో పాల్గొనేందుకు మైసూరుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొమ్మిది ఏనుగులు వచ్చాయి. రెండో దశలో మరో ఐదు ఏనుగులు రానున్నాయి. (Ram)

అభిమన్యు అనే ఏనుగు ఇప్పుడు దసరా బృందానికి కెప్టెన్​గా ఉన్నాడు. ఐదోసారి హౌడాను మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాగరహోళేలోని మాటిగోడు శిబిరానికి చెందిన 58 ఏళ్ల అభిమన్యు 1970లో కొడగు జిల్లా హెబ్బళ్ల అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. 2012 నుంచి  దసరా వేడుకల్లో అభిమన్యు పాల్గొంటున్నాడు. బంగారు కవచాన్ని మోసే పనిని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అభిమన్యు 2.74 మీటర్ల ఎత్తు, 4,700 నుంచి 5,000 కిలోల బరువు ఉంటాడు.

(2 / 10)

మైసూరు దసరా బృందంలో సీనియర్ అయిన వరలక్ష్మి (67)ప్రస్తుతం నాగరహోళేలోని భీమనకట్టె శిబిరంలో ఉంటోంది. ఇది కూడా కుంకి ఏనుగు. 2.36 అడుగుల ఎత్తు, 3300 నుంచి 3500 కిలోల బరువు ఉంటుంది. మైసూరు దసరా ఉత్సవాల్లో చాలాసార్లు పాల్గొంది.

(3 / 10)

కొడగులోని దుబారే శిబిరానికి చెందిన కంజన్ (25)దసరా ఉత్సవాల్లో జూనియర్! ప్రస్తుతం 25 ఏళ్ల వయస్సు ఉన్నాడు. గత ఏడాది తొలిసారి దసరా ఉత్సవాల్లో కంజన్ పాల్గొన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మావటి మాటలు విని కంజన్ మైసూరుకు రావడం ఇది రెండోసారి. అతను 2.62 ఎత్తు, 3700 కిలోల బరువుతో ఉన్నాడు.

(4 / 10)

చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకాలో ఏకలవ్య (38) అనే ఏనుగు దసరా బృందంలో చేరాడు. నాగరహోళేలోని మాటిగోడు శిబిరానికి చెందిన ఏకలవ్య తొలిసారిగా దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు. ఏకలవ్య వయసు 39 సంవత్సరాలు. ఏనుగు బరువు 4,150 కిలోలు. బరువు, 2.83 మీటర్ల ఎత్తు, 3.70 మీటర్ల పొడవున్న ఏనుగు.

(5 / 10)

కొడగులోని దుబారే ఏనుగుల శిబిరానికి చెందిన ధనుంజయ (43)ఈ సారి కూడా వచ్చాడు. 2013లో హసన్ జిల్లా యసలూరు రేంజ్​లో పట్టుబడడాడు. అడవి ఏనుగు, పులులను బంధించే ఆపరేషన్​లో ధనుంజయ ఉంటాడు. ధనుంజయ ఏనుగు గత ఐదేళ్లుగా దసరాలో పాల్గొంటున్నాడు. 2.80 మీటర్ల ఎత్తు, 4000 కిలోల బరువు ఉంటుంది.  

(6 / 10)

కొడగులోని దుబారే శిబిరానికి చెందిన గోపి వయస్సు ఇప్పుడు 42 సంవత్సరాలు. హసన్​లోని దొడ్డబెట్ట అటవీ ప్రాంతంలో 1990లో పట్టుబడ్డాడు. దసరా ఉత్సవాల్లో గోపీ పాల్గొనడం ఇది 12వ సారి. 2015లో గోపి అరమానె కిరీటం పొందిన ఏనుగుగా అవతరించింది. 2.86 మీటర్ల ఎత్తున్న గోపి బరువు 370 కిలోలు.  

(7 / 10)

బందీపూర్​లోని రాంపురా క్యాంపులో నివసించే రోహిత్వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు. దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు రోహిత్. 2.70 మీటర్ల ఎత్తు, 2900 నుంచి 3000 వరకు బరువు ఉంటాడు. గత ఏడాది కూడా దసరాకు వచ్చిన రోహిత్.. జంబూ సవారీలో పాల్గొనడం ఇది రెండోసారి.

(8 / 10)

కాబోయే కెప్టెన్ భీమా (24) ఏనుగు ఎత్తుగా ఉండటమే కాకుండా చూడటానికి అందంగా కూడా ఉంటాడు. 24 ఏళ్ల భీమా ఏనుగు నాగరహోళేలోని మాటిగోడు ఏనుగుల శిబిరానికి చెందినవాడు. అభిమన్యుని తరువాత బంగారు హౌడాను మోయడానికి అవసరమైన అన్ని ప్రత్యేక లక్షణాలు అతనికి ఉన్నాయి. 2009లో హసన్ జిల్లాలోని సక్లేష్ పూర్ లోని హెట్టూర్​లో పటటుబడ్డాడు.

(9 / 10)

మైసూరు జిల్లా పిరియాపట్నలోని దొడ్డ హార్వే శిబిరానికి చెందిన లక్ష్మి వయసు ఇప్పుడు 53 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం దసరా సందర్భంగా లక్ష్మి  పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2.52 అడుగుల ఎత్తు, 3000 నుంచి 3200 కిలోల బరువు ఉంటుంది. పలు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అనుభవం లక్ష్మీ ప్రత్యేకత,

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు