
(1 / 6)
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది.

(2 / 6)
2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు అక్టోబర్ 30న ఆఖరు తేదీ.

(3 / 6)
ప్రవేశ పరీక్ష జనవరి, 2026లో నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.nic.in/r ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలు, స్టూడెంట్ ఫోటో, సంతకం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

(4 / 6)

(5 / 6)

(6 / 6)
జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.850 , ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.700 ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఏపీ, తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలుంటాయి. పరీక్ష పూర్తి అయిన నాలుగు లేదా 6 వారాల లోపు ఫలితాలను ప్రకటిస్తారు. https://examinationservices.nic.in/ExamSys2026/ లింక్ తో నేరుగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే 011-40759000 హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదివచ్చు.
(Unsplash )ఇతర గ్యాలరీలు