Kannappa: కన్నప్ప మూవీ నుంచి శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్: చూసేయండి-akshay kumar shines as lord siva in first look poster from kannappa ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kannappa: కన్నప్ప మూవీ నుంచి శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్: చూసేయండి

Kannappa: కన్నప్ప మూవీ నుంచి శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్: చూసేయండి

Jan 20, 2025, 01:37 PM IST Chatakonda Krishna Prakash
Jan 20, 2025, 01:37 PM , IST

  • Kannappa - Akshay Kumar: కన్నప్ప సినిమా నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. ఈ చిత్రంలో పరమ శివుడిగా ఆయన నటిస్తున్నారు. ఆ లుక్ నేడు రిలీల్ అయింది.

మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నప్ప చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ మైథలాజికల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. శివుడి పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు (జనవరి 20) రిలీజ్ అయింది. 

(1 / 5)

శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఓ చేతిలో ఢమరుకం పట్టుకొని.. మరో చేతితో త్రిశూలాన్ని శివుడు సంధిస్తున్నట్టుగా ఈ లుక్ ఉంది.

(2 / 5)

“ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు” అంటూ ఈ పోస్టర్‌పై ఉంది. ఈ చిత్రం చేస్తుండడం తాను గర్వంగా భావిస్తున్నానని, ఈ దివ్యమైన ప్రయాణంలో తమకు శివుడు దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్.     

(3 / 5)

కన్నప్ప చిత్రంలో పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే ఆమె లుక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. 

(4 / 5)

శివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో కన్నప పాత్రను విష్ణు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు, మలయాళ స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు