(1 / 5)
నితిన్ రాబిన్‌హుడ్ మూవీ ఒకే రోజు ఓటీటీతో పాటు టీవీలోనూ టెలికాస్ట్ కాబోతోంది. మే 10 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజు జీ తెలుగు ఛానెల్‌లో ఈ మూవీ ప్రసారం కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.
(2 / 5)
తెలుగు టీవీ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరోహీరోయిన్లుగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ మే 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి జబర్ధస్థ్ మేకర్స్ నితిన్, భరత్ దర్శకత్వం వహించారు.
(3 / 5)
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాక్ మూవీ గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.
(4 / 5)
సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన సుందరంగాడి ప్రేమకథ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రాంకీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంకిత్ కొయ్య, లాస్య భావన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.
ఇతర గ్యాలరీలు