(1 / 9)
అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు భార్య నమత్ర, కూతురు సితారాతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అయ్యారు. ఈ ఫొటోలు మహేష్ లుక్ వైరల్ గా మారింది. ఆయన ఏజ్ మరింత తగ్గిందనే కామెంట్లు వస్తున్నాయి.
(instagram-annapurnastudios)(2 / 9)
అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు విక్టరీ వెంకటేష్ దంపతులు హాజరయ్యారు. నాగార్జునతో కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు.
(instagram-annapurnastudios)(3 / 9)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా అఖిల్, జైనాబ్ రిసెప్షన్ కు వెళ్లారు. తండ్రి నాగార్జున, తనయుడు అఖిల్ మధ్య నిలబడి ఇలా ఫోజు ఇచ్చారు రామ్ చరణ్.
(instagram-annapurnastudios)(4 / 9)
తన భార్యతో కలిసి నేచురల్ స్టార్ నాని ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఇటీవల హిట్ 3 మూవీ సక్సెస్ తో జోరుమీదున్నారు నాని. నాని, నాగార్జున కలిసి దేవదాస్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.
(instagram-annapurnastudios)(5 / 9)
తమిళ్ స్టార్ హీరో సూర్య ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రీసెంట్ గా రెట్రో మూవీతో సూర్య బ్లాక్ బస్టర్ కొట్టారు.
(instagram-annapurnastudios)(6 / 9)
కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాకీ భాయ్ యశ్ కూడా అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో పాల్గొన్నారు.
(instagram-annapurnastudios)(7 / 9)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అఖిల్, జైనాబ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. సీఎంను నాగార్జున సాదారంగా ఆహ్వానించారు.
(instagram-annapurnastudios)(8 / 9)
ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దంపతులు ఇలా అఖిల్, జైనాబ్ రిసెప్షన్ లో పాలు పంచుకున్నారు.
(instagram-annapurnastudios)(9 / 9)
అఖిల్ తో అక్కినేని కుటుంబం ఇలా ఫోజు ఇచ్చిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో నాగ చైతన్య, సుమంత్, సుశాంత్ కూడా ఉన్నారు.
(instagram-annapurnastudios)ఇతర గ్యాలరీలు