తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya rai: ఇన్ స్టాలో ఐశ్వర్య ఫాలో అయ్యే ఒకే ఒక్కడు ఎవరో తెలుసా?
సెలబ్రిటీ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారనే వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ధూమ్ 2 సెట్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రేమలో పడ్డారు. 2007 లో వారి వివాహం జరిగింది. ఐశ్వర్య ఇన్ స్టా లో ఒకే ఒక్కరిని ఫాలో అవుతుంది. అది ఎవరంటే?
(1 / 5)
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తలతో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జూనియర్ బచ్చన్ ఈ సంవత్సరం తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దాదాపు ఏడాది కాలంగా వీరిద్దరూ బహిరంగంగా ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ మధ్య ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.
(2 / 5)
అమితాబ్ బచ్చన్ కుటుంబంతో కలిసి కూడా ఐశ్వర్య ఇటీవల ఎలాంటి సినిమా ఫంక్షన్లకు కానీ, ఇతర బహిరంగ కార్యక్రమాలకు కానీ హాజరు కాలేదు.
(3 / 5)
అయితే, ఐశ్వర్య తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందో ఆమె సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది. ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యే వ్యక్తి మరెవరో కాదు, ఆమె భర్త అభిషేక్ బచ్చన్. దీనిపై పలువురు రెడ్డిట్ లో స్పందించారు. 'ఇంత మంచి భార్యను ఎలా వదిలేస్తారు బ్రదర్' అని ఒకరు రాశారు! మరొకరు 'నిజానికి అభిషేక్ ఐశ్వర్యకు అర్హుడు కాదు. అని కామెంట్ చేశాడు.
(4 / 5)
అభిషేక్, ఐశ్వర్య పెళ్లి ఉంగరం లేకుండా కనిపించడంతో వారిద్దరు విడిపోయారనే వార్తలు బలంగా వినిపించాయి. మరోవైపు అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ను లైక్ చేశారు.
(5 / 5)
ఐశ్వర్య తన కెరీర్ ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉంది. ఆ తరువాత వివేక్ ఒబెరాయ్ తో రిలేషన్ షిప్ లో ఉంది. రెండు బంధాలు చేదుగా ముగిశాయి. మరోవైపు అభిషేక్ కి కరిష్మా కపూర్ తో నిశ్చితార్థం జరిగింది. కుటుంబ కారణాల వల్ల వారిరువురి వివాహం జరగలేదు. 2007 ఏప్రిల్ 20న అభిషేక్, ఐశ్వర్యల వివాహం జరిగింది.
ఇతర గ్యాలరీలు