నుదుట సిందూర్‌తో.. సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో.. కేన్స్ లో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య రాయ్‌.. ఫొటోల‌కు ఫిదా కావాల్సిందే-aishwarya rai with sindoor in saree at cannes film festival 2025 very impressive look goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నుదుట సిందూర్‌తో.. సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో.. కేన్స్ లో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య రాయ్‌.. ఫొటోల‌కు ఫిదా కావాల్సిందే

నుదుట సిందూర్‌తో.. సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో.. కేన్స్ లో రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య రాయ్‌.. ఫొటోల‌కు ఫిదా కావాల్సిందే

Published May 22, 2025 09:43 AM IST Chandu Shanigarapu
Published May 22, 2025 09:43 AM IST

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అందాల తార ఐశ్వర్య రాయ్ తళుక్కుమంది. ఆమె లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. రెడ్ కార్పెట్ పై చీరలో ఆమె ఆకట్టుకుంది. నుదుట సిందూర్ తో ఆమె లుక్ ప్రశంసలు పొందుతోంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ముందుగా గుర్తొచ్చే భారతీయ నటీమణుల్లో ఐశ్వర్య రాయ్ ఒకరు. ఆమె మరోసారి కేన్స్ లో తళుక్కుమంది. చీరకట్టులో ఆకట్టుకుంది.

(1 / 5)

(AP)

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ ఎంట్రీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తెల్లటి చీరలో, అంచుపై బంగారు రంగు డిజైన్ తో ఐశ్వర్య రాయ్ లుక్ అదిరిపోయింది. చేతులు జోడించి నమస్కారం చెప్తూ, హాయ్ అంటూ ఐశ్వర్య పలకరించింది.

(2 / 5)

(AFP)

మహారాణిలా కనిపించిన ఐశ్వర్య రాయ్ నుదుట సిందూర్ ధరించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో దీనికి ప్రతీకగా ఐశ్యర్య సిందూర్ ధరించిందనే టాక్ వినిపిస్తోంది.

(3 / 5)

ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్ ను గుర్తుకు తెచ్చేలా ఐశ్వర్య రాయ్ సిందూర్ ధరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఐశ్వర్య నిలిచిందని అంటున్నారు.

(4 / 5)

(Lewis Joly/Invision/AP)

2002లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఇప్పుడు 51 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్ చేసింది.

(5 / 5)

(REUTERS)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు