(1 / 8)
బాలీవుడ్ గ్లామరస్ అండ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఐశ్వర్య తన కెరీర్‌లో ఎన్నో గొప్ప సినిమాలు చేసింది. అలాగే, ఐశ్వర్య రాయ్ ఎన్నో అవార్డులు గెలుచుకుంది. అయితే, ఐశ్వర్య రాయ్ రెజెక్ట్ చేసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 4000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరి ఐశ్వర్య రాయ్ మిస్ చేసుకున్న ఆ సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
(instagram)(2 / 8)
ఐశ్వర్యరాయ్ రెజెక్ట్ చేసిన సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్'. ఇది హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగు వేల కోట్లు రాబట్టింది. అయితే, ఐశ్వర్య రాయ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది.
(3 / 8)
ఐశ్వర్య రాయ్ 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' సినిమాతో పాటు ట్రాయ్ అనే సినిమా చేయడానికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అందుకు డేట్స్ లేకపోవడమే.
(4 / 8)
'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' గురించి ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ. “ఈ సినిమా నిర్మాతలు ఆరు నుంచి తొమ్మిది నెలల డేట్స్ కావాలని అడిగారు. కానీ, నేను చేయలేకపోయానను. ఎందుకంటే నాకు భారతదేశంలో కొన్ని కమిట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ సినిమాలను మధ్యలోనే విడిచిపెట్టడం నాకు సరైనదిగా అనిపించలేదు” అని చెప్పింది.
(5 / 8)
దర్శకుడు డగ్ లైమన్ రూపొందించిన 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' చిత్రంలో జాన్ స్మిత్ పాత్రలో బ్రాడ్ పిట్ నటించారు. ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ భార్య జేన్ స్మిత్ పాత్ర ఐశ్వర్య రాయ్ వద్దకు వచ్చింది.
(6 / 8)
అయితే, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాలో కొన్ని ఇంటిమేట్, బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సీన్స్‌లో నటించడం ఐశ్వర్యారాయ్‌కు నచ్చలేదని సమాచారం. ఆ బోల్డ్ సీన్స్‌లో డిస్‌కంఫర్ట్ కారణంగా మూవీని ఒప్పుకోలేదట ఐశ్వర్య రాయ్.
(7 / 8)
ఐశ్వర్య రాయ్ రెజెక్ట్ చేయడంతో ఆ పాత్ర హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలీకి చేరింది. ఇక బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ కలిసి నటించిన మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ బాక్సాఫీస్ వద్ద రూ. 4112 కోట్లు రాబట్టింది.
(instagram)(8 / 8)
అయితే ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ సినిమా చేయలేకపోవచ్చు. కానీ, హాలీవుడ్‌లో మాత్రం చాలా సినిమాలు చేసింది. ఇక మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాకు ఐఎమ్‌డీబీలో 10కి 6.5 రేటింగ్ ఉంది. జియో హాట్‌స్టార్‌లో మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు