తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Arjun: గ్రాండ్‌గా అర్జున్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ - హాజరైన తమిళనాడు సీఎం, రజనీకాంత్
సీనియర్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఇటీవలే కోలీవుడ్ నటుడు ఉమాపతితో ఏడడుగులు వేసింది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకకు తమిళనాడుకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
(1 / 5)
ఉమాపతి, ఐశ్వర్య అర్జున్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ రిసెప్షన్ ఫొటోలను ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
(2 / 5)
ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి సీఏం స్టాలిన్‌తో పాటు అగ్ర నటుడు రజనీకాంత్ హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు.
(3 / 5)
ఈ రిసెప్షన్ వేడుకలో ప్రభుదేవా, లోకేష్ కనగరాజ్, రోజా, డైరెక్టర్ శంకర్, ఉపేంద్రతో పాటు పలువురు దక్షిణాది సినీ నటులు సందడి చేశారు.
(4 / 5)
ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల పెళ్లి జూన్ 10న చెన్నైలో అర్జున్ నిర్మించిన అంజనేయ స్వామి ఆలయంలో సింపుల్‌గా జరిగింది
ఇతర గ్యాలరీలు