ఎయిమ్స్‌ మంగళగిరిలో 50 ఉద్యోగ ఖాళీలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...!-aims mangalagiri faculty jobs updates online applications closed on may 25 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఎయిమ్స్‌ మంగళగిరిలో 50 ఉద్యోగ ఖాళీలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...!

ఎయిమ్స్‌ మంగళగిరిలో 50 ఉద్యోగ ఖాళీలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు...!

Published May 24, 2025 12:40 PM IST Maheshwaram Mahendra Chary
Published May 24, 2025 12:40 PM IST

ఏపీలోని ఎయిమ్స్‌ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు రేపటితో పూర్తవుతుంది. మొత్తం 50 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. aiimsmangalagiri.edu.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

(1 / 6)

ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

 ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 50 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,అడిషనల్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. మే 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

(2 / 6)

మొత్తం 50 ఖాళీలు ఉండగా… వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 32 ఉండగా… ప్రొఫెసర్‌ - 07, అడిషనల్ ప్రొఫెసర్‌- 03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 8 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌, ఎమ్ఎస్సీ, ఎంసీహెచ్‌లో పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.

(3 / 6)

మొత్తం 50 ఖాళీలు ఉండగా… వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 32 ఉండగా… ప్రొఫెసర్‌ - 07, అడిషనల్ ప్రొఫెసర్‌- 03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 8 ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌, ఎమ్ఎస్సీ, ఎంసీహెచ్‌లో పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.

ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు హార్డ్ కాపీని రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ, అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503 చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన పది రోజులలోపు హార్డ్ కాపీ చేరాలి.

(4 / 6)

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే facultyrec@aiimsmangalagiri.edu.in మెయిల్ ను సంప్రదించవచ్చు. ఎంపిక ప్రక్రియను స్టాండింగ్ సెలక్షన్ కమిటీ పూర్తి చేస్తుంది.

(5 / 6)

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే facultyrec@aiimsmangalagiri.edu.in మెయిల్ ను సంప్రదించవచ్చు. ఎంపిక ప్రక్రియను స్టాండింగ్ సెలక్షన్ కమిటీ పూర్తి చేస్తుంది.

అర్హత ఉన్న వాళ్లు https://aiimsmangalagirifacultyrec25.cbtexam.in/Home/ListofExam.aspx లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

(6 / 6)

అర్హత ఉన్న వాళ్లు https://aiimsmangalagirifacultyrec25.cbtexam.in/Home/ListofExam.aspx లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు