ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో 'ఏఐ' టెక్నాలజీ - లబ్ధిదారులరా ఇలా మాత్రం చేయకండి...! వెంటనే దొరికిపోతారు-ai tool detect the false information provided in the indiramma housing scheme know these details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో 'ఏఐ' టెక్నాలజీ - లబ్ధిదారులరా ఇలా మాత్రం చేయకండి...! వెంటనే దొరికిపోతారు

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో 'ఏఐ' టెక్నాలజీ - లబ్ధిదారులరా ఇలా మాత్రం చేయకండి...! వెంటనే దొరికిపోతారు

Published May 19, 2025 11:51 AM IST Maheshwaram Mahendra Chary
Published May 19, 2025 11:51 AM IST

తెలంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వడివడిగా పట్టాలెక్కుతోంది. మొదటి విడతలోని లబ్ధిదారులు నిర్మాణాలు కూడా చేస్తున్నారు. రెండో విడత జాబితాలు సిద్ధమయ్యాయి. అయితే ఇంటి నిర్మాణం విషయంలో లబ్ధిదారులు తప్పుడు సమాచారం ఇస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే స్కీమ్ అమలులో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. మొదటి విడత కింద 70,122 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 47 వేల మందికిపైగా లబ్ధిదారులకు అనుమతులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ అందించారు. వీరిలో  17 వేల మందికిపైగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసుకున్నారు. వీరిలోనూ ఆరు వేల మందికిపైగా లబ్ధిదారులు పునాది వరకు పూర్తి చేసుకున్నారు.

(1 / 8)

ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలులో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను అమలు చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నుంచి ఇంటి నిర్మాణం పూర్తి వరకు ఇది ఉంటుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు... ఇంటి నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

(2 / 8)

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు.... ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు మాత్రమే ఇంటి నిర్మాణం జరగాలి. ఎక్కడైతే ఫొటో దిగారో అక్కడ మాత్రమే  ఇంటి నిర్మాణం చేసుకోవాలి. పాత ఇంటిని రిపేర్ వంటివి చేస్తే కుదరదు. ముఖ్యంగా ఇంటిని 400 చదరపు గజముల నుంచి 600 చదరపు గజాలలో మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో తేడాలు వస్తే.... ఏఐ టూల్ సాయంతో వెంటనే పట్టేస్తారు.

(3 / 8)

  ఇళ్లు నిర్మిస్తున్న స్థలం అక్షాంశ, రేఖాంశాలు ముందే యాప్ లో నమోదై ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తప్పులు చేస్తే బిల్లులు రాకుండా ఆగిపోతాయి. ఇంటి నిర్మాణ దశలను పక్కాగా యాప్ లో నమోదు చేస్తుంటారు. ఈ క్రమంలో ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తే... 'ఏఐ' సింపుల్ పట్టేస్తుంది.

(4 / 8)

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా యాప్‌లో పొందుపర్చిన నమూనాలతో పోలిస్తే వివరాల్లో తేడా రావొద్దు. అలా వస్తే కృత్రిమ మేధ సాంకేతికత గుర్తిస్తుంది. దీని ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి విచారణ జరుపుతారు. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఇలాంటి తప్పులు వెలుగు చూశాయి.

(5 / 8)

ఇళ్ల సర్వేలో  360 డిగ్రీల సమాచారంతో దరఖాస్తుదారుల వివరాలను యాప్‌లో నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు తప్పుడు సమాచారం ఇవ్వటం  లేదా అక్రమాలకు పాల్పడే చర్యలకు పూనుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

(6 / 8)

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలులో అధికారులను తప్పుదోవ పట్టించినా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పుడు వివరాలతో డబ్బులను పొందినా కేసులు నమోదు చేస్తారు.

(7 / 8)

ఇక రెండో విడత లబ్ధిదారుల విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహారిస్తోంది. యాప్‌ సర్వే వివరాలను క్షణ్ణంగా పరిశీలించి…  క్లౌడ్‌ ఆధారిత ఏఐ టెక్నాలజీతో సరిపోలుస్తూ లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు