తెలుగు న్యూస్ / ఫోటో /
హీరోహీరోయిన్ల తెరంగేట్రం.. భారీ బ్లాక్‍బస్టర్.. 25 ఏళ్ల తర్వాత ఇప్పడు రీ-రిలీజ్.. అప్పటి ఫొటోలు చూసేయండి
Kaho Naa Pyaar Hai Re Release: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫస్ట్ మూవీ ‘కహోనా ప్యార్ హై’ (2000) బ్లాక్‍బస్టర్ అయింది. ఆ చిత్రం మళ్లీ ఇప్పుడు థియేటర్లలోకి జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతోంది. అప్పటి ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 10)
హృతిక్ రోషన్, అమిషా పటేల్.. తెరంగేట్ర మూవీ 'కహోనా ప్యార్ హై' మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. హృతిక్ రోషన్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం రీ-రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం రిలీజై ఈనెలలోనే 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 10న రీ-రిలీజ్ చేస్తున్నట్టు పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. ఈ చిత్రం 2000 జనవరి 14న రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. అప్పటి ఫొటోలను ఇక్కడ చూడండి.
(2 / 10)
కహోనా ప్యార్ హై చిత్రంలో అనుపమ్ ఖేర్, సతీశ్ షా, మొహ్సిన్ బహ్ల్, దిలీప్ తాహిల్, ఆశిష్ విద్యార్థి, వ్రజేశ్ హిర్జీ కూడా కీలకపాత్రలు పోషించారు.
(3 / 10)
కహోనా ప్యార్ హై చిత్రం చేసి 25 ఏళ్ల అవుతోందంటే నమ్మలేకుండా ఉన్నానని హృతిక్ ఇటీవలే చెప్పారు.
(4 / 10)
“ఈ మైల్‍స్టోన్ స్ఫూర్తినిస్తోంది. అలాగే ఒదిగి ఉండాలని చెబుతోంది. నటుడిగా ఉండాలనే నా కల నెరవేరింది. రెండున్నర దశాబ్దాలుగా ప్రతీ రోజు నాకు దక్కుతున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది” అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు.
(5 / 10)
“ కహోనా ప్యార్ హై నా తొలి సినిమా. ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చి సెలెబ్రేట్ చేస్తున్నందుకు పీవీఆర్ ఐనాక్స్‌కు థ్యాంక్స్” అని హృతిక్ రోషన్ అన్నారు.
(6 / 10)
హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్.. కహోనా ప్యార్ హై చిత్రాన్ని నిర్మించారు. ఆయనే దర్శకత్వం కూడా వహించారు.
(7 / 10)
తండ్రిగా, నిర్మాతగా కహోనా ప్యార్ హై తనకు అద్భుతమైన సందర్భమని రాకేశ్ రోషన్ ఇటీవల వెల్లడించారు. 25ఏళ్ల తర్వాత కూడా ఈ చిత్రాన్ని సెలెబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
(8 / 10)
“ఈ సినిమా గురించి తలచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. నాకు, హృతిక్ రోషన్‍కు ఇంత ప్రేమను ఇచ్చిన సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఫీల్ అవుతుంటాను” అని రాకేశ్ రోషన్ చెప్పారు,
(9 / 10)
“ఇప్పటికీ పార్టీలు, ఈవెంట్లలో కహోనా ప్యార్ హై సినిమా పాటలు వింటుంటే ఫిల్మ్ మేకర్‌గా చాలా గర్వంగా అనిపిస్తుంది. హృతిక్ రోషన్ పుట్టిన రోజున ఈ సినిమా రీ-రిలీజ్‍ను సెలెబ్రేట్ చేయడాన్ని చూసేందుకు చాలా సంతోషంగా ఉన్నా” అని రాకేశ్ తెలిపారు.
ఇతర గ్యాలరీలు