Ratan Tata: వయసు తేడా రతన్ టాటా - శంతను స్నేహాన్ని ఆపలేకపోయింది, వారి స్నేహాన్ని కలిపింది శునకాలే
- Ratan Tata: మన దేశం దార్శనిక పారిశ్రామికవేత్త రతన్ టాటాను కోల్పోయింది. అతని ఆప్త మిత్రుడు శంతను నాయుడు. అతడు తన ఆప్తమిత్రుడిని కోల్పోయినట్లు లింక్డ్ ఇన్లో పోస్టు చేశారు.
- Ratan Tata: మన దేశం దార్శనిక పారిశ్రామికవేత్త రతన్ టాటాను కోల్పోయింది. అతని ఆప్త మిత్రుడు శంతను నాయుడు. అతడు తన ఆప్తమిత్రుడిని కోల్పోయినట్లు లింక్డ్ ఇన్లో పోస్టు చేశారు.
(1 / 4)
సోషల్ మీడియాలో శంతను నాయుడును రతన్ టాటా 'బెస్ట్ ఫ్రెండ్'గా, మరికొందరు అసిస్టెంట్గా పిలుస్తారు. రతన్ టాటాకు శంతను నాయుడు లింక్డ్ఇన్ పోస్ట్లో వీడ్కోలు సందేశం రాశారు. తన జీవితంలో రతన్ టాటా మిగిల్చిన శూన్యతను పూడ్చడం సాధ్యం కాదని లింక్డ్ ఇన్ పోస్ట్ లో పేర్కొన్నారు.
(2 / 4)
రతన్ టాటాకు, శంతనుకు మధ్య స్నేహం 2014లో ఏర్పడింది. వారిద్దరూ జంతు ప్రేమికులు. అదీ వారి మధ్య స్నేహాన్ని పెంచింది. 2014లో శంతను వీధి కుక్కల కోసం కాలర్ బెల్ట్ తయారు చేశాడు. వాటిని కొన్ని వీధి కుక్కల మెడలో వేశాడు. రాత్రి చీకట్లో వీధి కుక్కలు కార్లు ఢీకొనకుండా ఉండేందుకు శంతను బెల్టు తయారు చేశాడు. ఆయన ప్రయత్నాలు రతన్ టాటా దృష్టిని ఆకర్షించాయి. అలా వారి స్నేహం కలిసింది.
(3 / 4)
ఆ సమయంలో రతన్ టాటా తన వద్ద పనిచేయడానికి శంతనును ఆహ్వానించారు. శంతను నాయుడు గత పదేళ్లుగా రతన్ టాటా వద్ద పనిచేస్తున్నారు. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. గత కొన్నేళ్లుగా రతన్ టాటా వెంట శంతను నాయుడు నిత్యం కనిపిస్తూనే ఉన్నారు.
ఇతర గ్యాలరీలు