TCS variable pay: భారత టెక్ దిగ్గజం టీసీఎస్ కొంత మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. బోనస్ , వేరియబుల్ పరిహారం చెల్లింపును నెల ఆలస్యం చేసింది.
(1 / 5)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కొంత మంది ఉద్యోగాలకు షాక్ ఇచ్చింది. జూన్ త్రైమాసికంలో కొంతమంది ఉద్యోగులకు బోనస్ లేదా వేరియబుల్ పరిహారం చెల్లింపును నెల ఆలస్యం చేసింది. C3A, C3B, C4 కేటగిరీల ఉద్యోగుల జీతం కాంపోనెంట్ చెల్లింపులో ఆలస్యం పలు మీడియా సంస్థలు నివేదించాయి.
(Reuters)(2 / 5)
ఈ గ్రేడ్‌లలో అసిస్టెంట్ కన్సల్టెంట్స్, అసోసియేట్ కన్సల్టెంట్స్, కన్సల్టెంట్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు.
(Reuters)(3 / 5)
జులైలో చెల్లించాల్సిన మొత్తం ఆగస్టు నెలాఖరులోగా చెల్లించనున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
(Reuters)(4 / 5)
TCS ఉద్యోగులకు ఈ త్రైమాసికం ముగిసిన తర్వాత జీతంతో పాటు పనితీరు బోనస్ చెల్లించబడుతుందని సంస్థ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈసారి కొంత జాప్యం జరుగుతుందని సమాచారం.
(PTI Photo/Shashank Parade)(5 / 5)
టీసీఎస్ అధికారుల ఇది పరిపాలనాపరమైన సమస్యగా తెలిపారు. ఇది కొంత మంది ఉద్యోగులను మాత్రమే ప్రభావిత చేస్తుందని వెల్లడించారు. ఇది ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగం కాదన్నారు. నిజానికి ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అందరి పనితీరు సమీక్ష ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా, పే అలస్యం అయినట్లు వెల్లడించారు
(MINT_PRINT)ఇతర గ్యాలరీలు