(1 / 7)
హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఆఖరికి బాలీవుడ్‌లో సెటిల్ అయింది ఓ ముద్దుగుమ్మ. మోడలింగ్‌లో అలరించిన ఈ బ్యూటిపుల్ కెరీర్ తొలినాళ్లలో తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. కానీ, ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది ఈ సొగసరి.
(2 / 7)
ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు ది బ్యూటిపుల్ శ్రేయా ధన్వంతరి. హైదరాబాద్ బ్యూటి అయిన శ్రేయా ధన్వంతరి ఎక్కువగా హిందీ సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లతోనే పాపులర్ అయింది.
(3 / 7)
జోష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయా ధన్వంతరి ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన స్నేహగీతం మూవీలో ఒక హీరోయిన్‌గా కూడా అలరించింది. ఈ రెండు సినిమాలు శ్రేయాకు పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రేయా ధన్వంతరి.
(4 / 7)
హిందీలో లూప్ లపేటా, ముంబై డైరీస్ 26/11 వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది శ్రేయా ధన్వంతరి. కానీ, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 ఓటీటీ సిరీస్‌లు శ్రేయా ధన్వంతరికి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి.
(5 / 7)
ఆ తర్వాత గన్స్ అండ్ గులాబ్స్ అనే మరో ఓటీటీ వెబ్ సిరీస్ చేసింది శ్రేయా ధన్వంతరి. దీనికంటే ముందుగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విలన్‌గా మెప్పించిన చుప్ మూవీలో హీరోయిన్‌గా, రివ్యూవర్‌గా అలరించింది శ్రేయా ధన్వంతరి.
(6 / 7)
సినిమాలు, ఓటీటీ సిరీస్‌లతో అలరించే శ్రేయా ధన్వంతరి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది. బికినీ, స్విమ్ సూట్‌లలో సెక్సీ షోతో అభిమానులు, ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది.
(7 / 7)
ఎక్కువగా బీచ్ ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది శ్రేయా ధన్వంతరి. ఇందులో బోల్డ్‌గా అందాలు వడ్డిస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది శ్రేయా. దీంతో శ్రేయా ధన్వంతరి గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి.
ఇతర గ్యాలరీలు