(1 / 8)
రేఖ మరియు అమితాబ్ బచ్చన్ - రేఖ, అమితాబ్ బచ్చన్ జంట సినిమాల్లో సక్సెస్ ఫుల్ పెయిర్. వారి ప్రేమ ఇప్పటికీ చర్చనీయాంశమే. వారిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే, 1981లో వచ్చిన సిల్సిలా వారిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా. ఈ సినిమాలో జయాబచ్చన్ కూడా నటించారు. అమితాబ్ తో మళ్ళీ ఎందుకు కలిసి పనిచేయలేదో రేఖ ఇటీవల వెల్లడించారు.
(instagram)(2 / 8)
బిగ్ బితో ఎదగలేదు - ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ, సిల్ సిలా తరువాత అమిత్ జీతో నటించే అవకాశం లభించకపోవడం బాధాకరమన్నారు. దానివల్ల తాను ఎంతో నష్టపోయానన్నారు.
(instagram)(3 / 8)
భవిష్యత్తులో అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేయడానికి సంబంధించి కూడా రేఖ స్పందించారు. ‘‘బిగ్ బీ తో కలిసి నటించడం కోసం ఎదురు చూడడం కూడా విలువైనదే. ప్రతిదీ సరైన సమయంలో సరైన కారణంతో జరుగుతుంది’’ అని రేఖ అన్నారు.
(instagram)(4 / 8)
’’నేను ఓర్పు, సహనాలను నమ్ముతాను. సహనం అనంతరం లభించే ఫలాలు చాలా తీయగా ఉంటాయి. మా ఇద్దరినీ ఒక సినిమాలో కలిపేందుకు ఏ దర్శకుడు వస్తాడో వేచి చూడాలి’’ అని రేఖ వ్యాఖ్యానించారు.
(instagram)(5 / 8)
బిగ్ బితో కలిసి పనిచేసిన అనుభవం గురించి కూడా రేఖ వివరించారు. రేఖ అమితాబ్‌ను ప్రశంసిస్తూ, ‘‘అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అనుభవం అద్భుతం. దానిని మాటల్లో వ్యక్తపరచలేం’’ అని అన్నారు.
(instagram)(6 / 8)
ప్రముఖ రచయిత హనీఫ్ జవేరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిజానికి జయాబచచన్ సిల్ సిలా సినిమాలో పనిచేయకూడదని నిర్ణయించుకున్నారని, కానీ ఆమెను సంజీవ్ కుమార్ ఒప్పించాడని వెల్లడించారు. సంజీవ్ కుమార్ ను జయాబచ్చన్ సొంత సోదరుడిలా భావిస్తారు.
(instagram)(7 / 8)
సిల్ సిలా సినిమాలో నటించడానికి జయబచ్చన్ ను ఒప్పించడానికి సంజీవ్ కుమార్ చాలా కష్టపడ్డారు, ‘‘నేను కూడా సినిమాలో ఉన్నాను, నువ్వు ఎందుకు నిరాకరిస్తున్నావు?" అని అడిగారు. అయితే, సిల్ సిలా లో నటించడానికి జయ ఒక షరతు పెట్టారు. అదేంటంటే, తనకు షూట్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ సెట్‌కి వస్తానని ఆమె షరతు విధించింది. ఆ సినిమా కథ కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నే కావడం విశేషం.
(instagram)(8 / 8)
సిల్ సిలా సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు, కానీ అది క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా గురించిన ప్రత్యేకత ఏమిటంటే జావేద్ ఈ సినిమాతోనే గీత రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించాడు.
(instagram)ఇతర గ్యాలరీలు