తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: పుష్ప 2 ప్రమోషన్స్‌లో ఇక రష్మిక మంధాన బిజిజిబీ.. మళ్లీ సౌత్‌లో టాప్ ప్లేస్‌పై కన్నేసిన ముద్దుగుమ్మ
Pushpa 2: 2021లో పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా ఎదిగిపోయిన రష్మిక మంధాన ఈ మూడేళ్లలో సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బోలెడు సినిమాలు చేసింది. కానీ.. సౌత్‌లో ఆమె నెం.1 స్థానానికి ఇటీవల గండిపడింది.
(1 / 9)
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక మంధాన పాల్గొంటోంది. పట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి శారీలో వచ్చిన రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. (instagram/rashmika_mandanna)
(2 / 9)
దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు నగరాల్లో పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఆదివారం పట్నాలో ముగియగా.. ఇంకా ఆరు సిటీలు ఉన్నాయి. దాంతో ఈ నెల మొత్తం రష్మిక ప్రమోషన్స్‌లోనే ఉండనుంది. (instagram/rashmika_mandanna)
(3 / 9)
బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ఎవరూ ఊహించనంత స్పందన లభించింది. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు ఈ ఈవెంట్‌కి వచ్చారు. (instagram/rashmika_mandanna)
(4 / 9)
పుష్ప 2 ట్రైలర్‌లో రష్మిక చాలా పవర్‌ఫుల్‌గా కనిపించింది. అల్లు అర్జున్‌తో రొమాన్స్ సన్నివేశాలే కాదు.. ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. (instagram/rashmika_mandanna)
(5 / 9)
పుష్ప 2 ప్రమోషన్స్‌కి చిత్ర యూనిట్ మొత్తం కలిసే వెళ్తోంది. ఇంటర్యూలు ఇవ్వడంతో టీమ్ మొత్తం బిజి బిజీగా ఉంటోంది. రష్మికకి ఇటీవల బాలీవుడ్‌లోనూ యానిమల్ సినిమాతో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. (instagram/rashmika_mandanna)
(6 / 9)
బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. గత కొంతకాలంగా సౌత్‌లో సినిమాలు తగ్గించింది. అయితే.. పుష్ప 2 ఆ లోటుని తీర్చి మళ్లీ సౌత్‌లో తనని టాప్ హీరోయిన్‌గా నిలబెడుతుందని ఈ భామ ఆశిస్తోంది. (instagram/rashmika_mandanna)
(7 / 9)
పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్స్‌కి స్పెషల్ ప్లైట్‌లో అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక మంధాన చక్కర్లు కొడుతోంది. పాట్నాకి కూడా ఈ ఇద్దరూ కలిసి వెళ్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. (instagram/rashmika_mandanna)
(8 / 9)
పుష్ప 2లో రష్మిక ఎక్కువగా శారీలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప రాజ్ భార్యగా.. ఆమె రోల్ మూవీలో చాలా కీలకంకానుండగా.. పుష్ప -1లోనూ శ్రీవల్లి క్యారెక్టర్‌తోనే సినిమా మొత్తం మలుపు తిరిగిన విషయం తెలిసిందే. (instagram/rashmika_mandanna)
ఇతర గ్యాలరీలు