తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంటున్న కీర్తి సురేశ్, హోమ్లీ హీరోయిన్ నుంచి గ్లామర్ డాల్‌గా!
Keerthy Suresh Wedding Date: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోంది. సౌత్‌లో వరుస సినిమాలో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది.
(1 / 8)
హోమ్లీ హీరోయిన్‌గా తొలుత పేరు తెచ్చుకున్న కీర్తీ సురేశ్.. సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమాలో అందాల్ని ఆరబోస్తూ.. మహేష్ బాబుతో డ్యాన్స్‌లో అదరగొట్టేసింది. (keerthysureshofficial/instagram)
(2 / 8)
2013లో వచ్చిన గీతాంజలి అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన క్తీరి సురేశ్.. నేను లోకల్‌తో మంచి కమర్షియల్ హిట్ అందుకుని, మహానటి మూవీకి నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. (keerthysureshofficial/instagram)
(3 / 8)
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోంది. సుదీర్ఘకాలంగా ఆంటోనీ తట్టిల్‌తో ప్రేమలో ఉన్న కీర్తి సురేశ్ త్వరలోనే అతనితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. (keerthysureshofficial/instagram)
(4 / 8)
డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. (keerthysureshofficial/instagram)
(5 / 8)
డిసెంబర్ 11న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కీర్తి సురేశ్, ఆంటోనీ తట్టిల్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు కీర్తి తండ్రి అక్కడికి వెళ్లి ఏర్పాట్లని కూడా పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. (keerthysureshofficial/instagram)
(6 / 8)
వ్యాపారవేత్త అయిన తట్టిల్‌తో కీర్తి సురేశ్ ప్రేమలో ఉన్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో మీ బాయ్‌ఫ్రెండ్ తట్టిల్ కదా? అని ఓ జర్నలిస్ట్ అడగ్గా కీర్తి పకపకా నవ్వేసింది. కానీ సమాధానం చెప్పలేదు.(keerthysureshofficial/instagram)
(7 / 8)
పెళ్లి, ప్రేమ గురించి అడిగిన ఓ ప్రశ్నకి.. అవసరమైనప్పుడు ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో నేనే చెప్తాను అంటూ కీర్తి సురేశ్ సమాధానాన్ని దాటవేసింది. అప్పటి వరకూ కూల్ అంటూ ఉచిత సలహా ఇచ్చింది. (keerthysureshofficial/instagram)
ఇతర గ్యాలరీలు