Gauthami Kamal Haasan: కమల్ హాసన్‌తో బ్రేకప్‌పై గౌతమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాధేస్తుంది కానీ అంటూ..
Gauthami Kamal Haasan: సీనియర్ నటి గౌతమి నటుడు కమల్ హాసన్ తో లివిన్ రిలేషన్షిప్, బ్రేకప్ పై ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అది బాధాకరమే అయినా మరిచిపోయి ముందుకు సాగడమే సరైనదని ఆమె చెప్పింది.
(1 / 6)
Gauthami Kamal Haasan: ప్రేమలో బ్రేకప్ అనేది చాలా బాధాకర విషయమని, అయితే అది మరిచిపోయి ముందుకు సాగిపోవడమే మంచిదని గౌతమి చెప్పింది.
(2 / 6)
Gauthami Kamal Haasan: నటి గౌతమి ఈ మధ్య పాపులర్ తమిళ మ్యూజిక్ ఛానెల్ ఎస్ఎస్ మ్యూజిక్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన బ్రేకప్ గురించి స్పందించింది. ఆమె కమల్ హాసన్ తో 13 ఏళ్లు సహజీవనం చేసి విడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. "ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ అనేది ఉంటుంది. ముఖ్యంగా యవ్వన వయసులో. అది మనకు జరిగినప్పుడు గుండె పగులుతుంది. అయితే ఈ సమయంలో దాని గురించి ఆలోచించకుండా ఈ స్థాయికి చేరడానికి ఇన్నేళ్లు స్కూల్, కాలేజీ లో ఏం సాధించామో గుర్తు చేసుకోవాలి" అని గౌతమి చెప్పింది.
(3 / 6)
Gauthami Kamal Haasan: ఆ బ్రేకప్ నుంచి పాఠం నేర్చుకొని ముందుకు సాగిపోవాలని గౌతమి అభిప్రాయపడింది. అది ఎంత బాధ కలిగించినా అందులో మంచిని కూడా చూడాలి. ఆ బాధ మరచిపోవడానికి ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అని గౌతమి సూచించింది.
(4 / 6)
Gauthami Kamal Haasan: ప్రయాణాలు బాగా చేయాలని గౌతమి చెప్పింది. ఒకే చోట ఉంటే ఆ వ్యక్తితో గడిపిన క్షణాలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే అది మరచిపోయి ఎక్కడికైనా వెళ్లాలి. జాబ్ కూడా మారండి. దీని వల్ల కొత్తగా బాధ్యతలు పెరిగి మీ జీవితంలో కొత్త మార్పు తీసుకొస్తాయి అని గౌతమి సూచించింది.
(5 / 6)
Gauthami Kamal Haasan: ఓ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది బ్రేక్ అయితే దానికి పూర్తి బాధ్యతను మీరే తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్బంగా గౌతమి స్పష్టం చేసింది.
ఇతర గ్యాలరీలు