(1 / 6)
మలైకా, అర్జున్ కపూర్ 2019 నుండి డేటింగ్ చేస్తున్నారు. బయట ఎక్కడ కనిపించినా చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉంటారు. ఇంకా పెళ్లి చేసుకోని ఈ జంటకు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి.
(2 / 6)
అయితే మలైకా, అర్జున్ కపూర్.. ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు. మలైకా అరోరా- అర్జున్ కపూర్‌ని పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమె గర్భవతి అనే వార్త బాలీవుడ్‌లో మళ్లీ ప్రకంపనలు సృష్టించింది.
(3 / 6)
మలైకా ప్రెగ్నెంట్ అనే వార్త వ్యాప్తి చెందడంతో, నటుడు అర్జున్ కపూర్ పుకార్లపై స్పందించాడు. 'మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు. సెలబ్రిటీలు కూడా మనుషులే అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు.' అని అర్జున్ కామెంట్స్ చేశాడు.
(4 / 6)
ప్రెగ్నెంట్ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అర్జున్ కపూర్ కాస్త విసుగు చెందినట్టుగా మాట్లాడారు.
(5 / 6)
'ప్రతికూలతను వ్యాప్తి చేయడం చాలా సులభం. ప్రజలు దానికి సులభంగా ఆకర్షితులవుతారు. మేము కళాకారులం. మాకు వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది. మీరు మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి. మీరు ఏదైనా రాయాలనుకుంటే, నిజాయితీగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఊహించి రాయకండి. ఎందుకంటే మనం కూడా మనుషులమే.' అని అర్జున్ అన్నాడు.
(6 / 6)
49 ఏళ్ల మలైకా, 37 ఏళ్ల అర్జున్ కపూర్ గత నాలుగేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నిత్యం వార్తల్లో ఉండే ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటుంది.
ఇతర గ్యాలరీలు