(1 / 7)
మిస్ యూనివర్స్ 2024 లో టాప్ 30 లో చేరిన మొదటి ఈజిప్టు కంటెస్టెంట్ లోకినా సలా. ఆమె విజేతగా మారిపోయినా కూడా అందరికీ తెగ నచ్చేసింది. ముఖంపై తెల్లని మచ్చ ఉన్నా కూడా ఆమె ప్రపంచంలోని అందగత్తెలతో పోటీ పడింది.
(Instagram )(2 / 7)
నవంబర్ 17న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో ఈజిప్టుకు చెందిన లోకీనా సలాహ్ చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో 73 ఏళ్ల చరిత్రలో టాప్ 30కి చేరిన తొలి ఈజిప్టు బ్యూటీగా లోకీనా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ముఖంపై తెల్లని మచ్చతో అందాల పోటీలో పాల్గొన్న తొలి మహిళగా కూడా చరిత్ర సృష్టించింది.
(Instagram )(3 / 7)
బొల్లి వ్యాధి ఉన్న వాళ్లు మిస్ యూనివర్స్ పోటీలో ఇంతవరకు పాల్గొనలేదు. కానీ ఆమె ఆత్మ విశ్వాసతంలో ముందుకు సాగింది.
(Instagram )(4 / 7)
ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
(Instagram )(5 / 7)
ద్వేషం, వివక్ష లేని ప్రపంచాన్ని సృష్టిద్దాం అంటూ ఆమెను చూసిన నెటిజన్లు కామెంట్ చేశారు.
(Instagram)(6 / 7)
లోకీనా సలాహ్ 1990 ఏప్రిల్ 21న ఈజిప్టులో జన్మించింది. తీరప్రాంత నగరం అలెగ్జాండ్రియాలో పెరిగారు. బొల్లిపై అవగాహన కోసం ఆమె సౌందర్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
(Instagram)(7 / 7)
మూడు సంవత్సరాల క్రితం, లోకీనా తన కలలను సాకారం చేసుకోవడానికి తన 10 సంవత్సరాల కుమార్తె అమీతో కలిసి దుబాయ్ కు మకాం మార్చింది. మహిళల కోసం శక్తివంతమైన న్యాయవాదిగా, ఆమె ది బియాండ్ ది సర్ఫేస్ ఉద్యమాన్ని ప్రారంభించింది - పిల్లలు, యువకులు, ముఖ్యంగా మహిళలు, బాలికల ఆమె కష్టపడుతోంది.
(Instagram)ఇతర గ్యాలరీలు