Maha Shivaratri 2025 : నిత్యం పెరిగే శివ లింగం.. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టం!-a shiva lingam growing in a temple in suryapet district of telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maha Shivaratri 2025 : నిత్యం పెరిగే శివ లింగం.. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టం!

Maha Shivaratri 2025 : నిత్యం పెరిగే శివ లింగం.. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టం!

Published Feb 21, 2025 06:10 PM IST Basani Shiva Kumar
Published Feb 21, 2025 06:10 PM IST

  • Maha Shivaratri 2025 : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువులో పెరిగే శివ లింగం ఉంది. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిశాడు. ఈ శివలింగం నిత్యం పెరుగుతూ ఉండటం విశేషం. ఇక్కడ శివలింగానికి గంగాదేవి అభిషేకం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి చెందింది.

త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యకు తిరిగి వెళుతుండగా.. మేళ్లచెరువు ప్రాంతంలో ఆగినట్లు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ రామేశ్వర లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఆ తరువాత కొంతకాలానికి ఈ లింగం భూమిలోకి కుంగిపోయింది. ఆ తరువాత అదే చోట స్వయంభువుగా శివలింగం ఉద్భవించింది. ఈ శివలింగం నిత్యం పెరుగుతూ ఉండటం విశేషం.

(1 / 6)

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ఈ ఆలయం నాలుగు దిక్కులా నాలుగు గోపురాలతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

(2 / 6)

ఈ ఆలయ నిర్మాణం చూస్తే.. కాకతీయ రాజవంశం శిల్పకళను ప్రతిబింబిస్తుంది. ఇక్కడి అద్భుత విశేషమేంటంటే.. గర్భాలయంలోని శివలింగం ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయాన్ని సందర్శిస్తే ఇందుకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లను కూడా చూపిస్తారు.

(3 / 6)

ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా వైభవంగా జాతర నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. వేకువజామునే శివాలయంలో స్వామి వారికి అభిషేకాలతో జాతరను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభల ఊరేగింపు ఉంటుంది. రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు.

(4 / 6)

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం పాణవట్టంతో కలిసి ఉంటుంది. శివలింగమైన భూమిని ఆనుకొని పానవట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని అర్ధనారీశ్వర రూపంగా కొలుస్తారు. శివలింగంపై మధ్యలో సంప్రదాయ నృత్యాలు ఒక రేఖగా ఉంటుంది.

(5 / 6)

హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు కోదాడ నుండి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కోదాడ నుండి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. నల్గొండ, మిర్యాలగూడ నుండి వచ్చేవాళ్లు హుజూర్ నగర్ కు చేరుకుని అక్కడి నుండి పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మేళ్లచెర్వుకు చేరుకోవచ్చు.

(6 / 6)

Basani Shiva Kumar

eMail

ఇతర గ్యాలరీలు