Mulayam Singh Yadav death : ములాయం సింగ్​ యాదవ్​.. 'అందరివాడు'!-a look at mulayam singh yadav s life in photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  A Look At Mulayam Singh Yadav's Life In Photos

Mulayam Singh Yadav death : ములాయం సింగ్​ యాదవ్​.. 'అందరివాడు'!

Oct 10, 2022, 03:10 PM IST Sharath Chitturi
Oct 10, 2022, 03:10 PM , IST

Mulayam Singh Yadav death : ఎస్​పీ వ్యవస్థాపకుడు, మూడుసార్లు యూపీ సీఎంగా పని చేసిన ములాయం సింగ్​ యాదవ్​.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు నేతాజి అనే పేరు ఉంది. 10సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఒకసారి ఎంపీగాను విజయం సాధించారు.

ఎస్​పీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం 82ఏళ్ల ములాయం సింగ్​ యాదవ్​.. గురుగ్రామ్​ మేదాంత ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు.

(1 / 7)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాయం సింగ్​ యాదవ్​.

(2 / 7)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాయం సింగ్​ యాదవ్​.

విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్న ములాయం సింగ్​ యాదవ్​.. 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచారు. మూడుసార్లు సీఎంగా, ఒకసారి రక్షణమంత్రిగా పనిచేశారు.

(3 / 7)

రామ్​ మనోహర్​ లోహియాకు చెందిన సంయుక్త్​ సోషలిస్ట్​ పార్టీ నుంచి తన రాజకీయ పస్థానాన్ని ప్రారంభించారు ములాయం సింగ్​. అనంతరం భారతీయ క్రాంతి దళ్​, భారతీయ లోక్​ దళ్​కు మారారు. చివరికి సమాజ్​వాదీ జనతా పార్టీ పెట్టారు.

(4 / 7)

ఆయనకి ‘నేతాజి’ అని గుర్తింపు ఉంది. అవసరమైనప్పుడల్లా విపక్షాలతో కలిసి పని చేశారు ఆయన. బీఎస్​పీ, బీజపీ, కాంగ్రెస్​తో పలుమార్లు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.

(5 / 7)

ములాయం సింగ్​ మరణం పట్ల అనేక మంది రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది అంటూ కొనియాడారు.

(6 / 7)

ములాయం మరణం నేపథ్యంలో యూపీవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం. అధికార లాంఛనాలతో ములాయం యాదవ్​ అంత్యక్రియలు జరగనున్నాయి.

(7 / 7)

ములాయం మరణం నేపథ్యంలో యూపీవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం. అధికార లాంఛనాలతో ములాయం యాదవ్​ అంత్యక్రియలు జరగనున్నాయి.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు