(1 / 7)
అక్టోబరు 22, నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి అక్టోబర్24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఇది ఎటు వెళ్తుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది.
(2 / 7)
ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.
(3 / 7)
ఇక ఏపీలో ఇవాళ(అక్టోబర్ 19) విజయనగరం,మన్యం,అల్లూరి,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు,ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు,కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(5 / 7)
తెలంగాణలో చూస్తే ఇవాళ (అక్టోబర్ 19) తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
అక్టోబర్ 20, 21 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
(7 / 7)
అక్టోబర్ 22 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే వచ్చే వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో… పరిస్థితులు మారే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు