తెలుగు న్యూస్ / ఫోటో /
Sad Ending Love Movies: గుండెల్ని పిండేసే సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?
సినిమాల్లో ప్రేమకథలు ఎప్పుడు సుఖాంతమే అవుతుంటాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైన చివరకు ప్రేమికులు కలుస్తుంటారు.ఈ సినిమాటిక్ రూల్‌కు భిన్నంగా నాయకానాయికల ప్రేమకథ విషాదాంతంగా ముగిసే కథలు అరుదుగా వస్తుంటాయి. సాడ్ ఎండింగ్‌తో వచ్చిన బెస్ట్ లవ్‌స్టోరీ మూవీస్ ఏవంటే?
(1 / 5)
విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ 96 ఎవర్‌గ్రీన్ లవ్‌స్టోరీగా నిలిచింది. హీరోకు దూరంగా హీరోయిన్ శాశ్వతంగా వెళ్లిపోయే సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ సాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్ వెర్షన్‌ను ఆహా ఓటీటీలో చూడొచ్చు.
(2 / 5)
ధనుష్, శృతిహాసన్ జంటగా తమిళంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన త్రీ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. త్రీ మూవీ క్లైమాక్స్‌లో ధనుష్ చనిపోయినట్లుగా చూపిస్తారు. ఈ సినిమాలో ధనుష్ అద్భుతమైన యాక్టింగ్, అనిరుధ్ పాటలను సినీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.
(3 / 5)
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 7/ జీ బృందావన కాలనీ తమిళంతో పాటు తెలుగులోనూ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమాదంలో హీరోయిన్ చనిపోవడం, ఆమె జ్ఞాపకాలతో హీరో బతుకుతున్నట్లుగా డైరెక్టర్ ఈ మూవీని ఎండ్ చేశారు. ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
(4 / 5)
జై, అంజలి, శర్వానంద్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఎంగేయుమ్ ఎప్పొడుమ్ (తెలుగులో జర్నీ) కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌గా నిలిచింది. ఓ రెండు జంట ప్రేమకథల్లో ఒకటి విషాదాంతంగా, మరొకటి సుఖాంతంగా దర్శకుడు క్లైమాక్స్‌లో చూపిస్తాడు. ఈ లవ్ స్టోరీ మూవీని ఆమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు
(5 / 5)
కార్తి, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ పరత్తువీరన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియమణి క్యారెక్టర్ విషాదంగా ముగుస్తుంది. ఆమె ప్రేమ కోసం హీరో చేసే త్యాగాన్ని దర్శకుడు హృద్యంగా చూపించాడు. ఈ మూవీ నేషనల్ అవార్డును గెలుచుకున్నది. తెలుగులో మల్లిగాడు పేరుతో డబ్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు