80s Stars Reunion: ఒకే ఫ్రేములో 80s స్టార్స్ - రీ యూనియన్ వేడుకల ఫొటోలు వైరల్
80s Stars Reunion: 1980వ దశకంలో అగ్రనాయకానాయికలుగా వెలుగొందిన తారలందరూ ఒక చోటకు చేరుకున్నారు. ఆట పాటలతో సందడి చేశారు. ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పేరుతో గత కొన్నేళ్లుగా అలనాటి స్టార్స్ ప్రతి ఏడాది ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నారు. ఈ వేడుకలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన 80వ దశకానికి చెందిన హీరోలుహీరోయిన్లు అందరూ పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఈ రీయూనియన్ వేడుకలు ముంబాయిలో జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 3)
ఈ ఏడాది రీయూనియన్ వేడుకలకు జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్ ఆతిథ్యం ఇచ్చారు. ముంబాయిలో ఈ వేడుక జరిగింది.
(2 / 3)
ఈ రీయూనియన్ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
(3 / 3)
ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేష్, అనుపమ్ ఖేర్, శరత్‌కుమార్, భానుచందర్, అర్జున్, అనిల్‌కపూర్, రేవతి, సుమతల, నదియా, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు