తెలుగు న్యూస్ / ఫోటో /
800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే
- 800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఇండియన్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యే షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ కేవలం 11 రోజుల్లోనే ఈ రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.
- 800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఇండియన్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యే షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ కేవలం 11 రోజుల్లోనే ఈ రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.
(1 / 7)
800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.
(2 / 7)
800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమా దంగల్. 2016లో ఈ మూవీ రిలీజైంది. ఆమిర్ ఖాన్ ఇందులో నటించాడు. నితీష్ తివారీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెజ్లర్ మహావీర్ ఫొగాట్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కింది. అంతేకాదు చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ ఇంగ్లిష్ మూవీగా కూడా దంగల్ నిలవడం విశేషం.
(3 / 7)
800 crore club movies: మన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా రూ.1750 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపింది. దంగల్ తర్వాత రూ.1000 కోట్ల మార్క్ దాటిన సినిమా ఇదే.
(4 / 7)
800 crore club movies: రాజమౌళి క్రియేట్ చేసిన మరో అద్భుతం ఆర్ఆర్ఆర్. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కూడా గెలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైనే ఈ సినిమా వసూలు చేసింది.
(5 / 7)
800 crore club movies: ప్రశాంత్ నీల్, యశ్ కలిసి చేసిన మ్యాజిక్ కేజీఎఫ్ చాప్టర్ 2. గతేడాది రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1230 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. 2018లో వచ్చిన కేజీఎఫ్ మూవీకి ఇది సీక్వెల్.
(6 / 7)
800 crore club movies: ఈ ఏడాది మొదట్లో వచ్చిన మూవీ పఠాన్. నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1055 కోట్లు వసూలు చేసింది.
ఇతర గ్యాలరీలు