DA hike : డీఏ పెంపు.. ఆశించిన దాని కన్నా ఈసారి తక్కువే! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తప్పదా?
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ఈసారి 4 శాతం పెరగకపోవచ్చని ఓ నివేదిక చెబుతోంది. డీఏ పెంపుపై సెప్టెంబర్ 3వ వారంలో ఒక ప్రకటన వెలువడనుందని సమాచారం.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ఈసారి 4 శాతం పెరగకపోవచ్చని ఓ నివేదిక చెబుతోంది. డీఏ పెంపుపై సెప్టెంబర్ 3వ వారంలో ఒక ప్రకటన వెలువడనుందని సమాచారం.
(1 / 5)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ఈసారి 4 శాతం పెరగకపోవచ్చు. బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు ఉండదు. బదులుగా, కరువు భత్యం 3శాతం పెరగొచ్చు!
(2 / 5)
సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం మూడు శాతం చొప్పున డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదల రేటుపై డీఏ పెంపు రేటు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం 50 శాతం డియర్నెస్ అలవెన్స్ లభిస్తుంది. డీఏను బేసిక్ పేలో విలీనం చేస్తారని కొన్ని వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 50 శాతానికి మించితే మూలవేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో విలీనం కాదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
(3 / 5)
మరోవైపు పే కమీషన్‌పై సమావేశమవుదామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిందని తెలుస్తోంది. జేసీఎం నేషనల్ కౌనసిల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రాకు సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి డైరక్ట్‌గా లేఖ అందిని సమాచారం. ప్రధానమంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాలతో కలుస్తారని అందులో ఉందట! ఇదంతా కొత్త పే కమిషన్ ఏర్పాటు కోసమే అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
(4 / 5)
ఈ నెల 24న జేసీఎం జాతీయ మండలి స్టాఫ్ సైడ్ ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. కాగా, సమావేశానికి సంబంధించిన నిర్దిష్ట షెడ్యూల్ ను తర్వాత తెలియజేస్తామని లేఖలో పేర్కొన్నారు.
(5 / 5)
7వ వేతన సంఘం సిఫారసులను ప్రభుత్వం 2016 జనవరి 1న అమల్లోకి తెచ్చింది. అప్పట్లో అంతర్జాతీయ కార్మిక సంఘం నిబంధనలు, డాక్టర్ ఎక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నెలవారీ కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. కనీస వేతనాన్ని రూ.18 వేలు మాత్రమే ఉంచారు.
ఇతర గ్యాలరీలు