OTT: ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న శ్రీపథ్ ఎవరు? పురస్కారం తెచ్చిన ఆ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
Best Child Artist Sreepath 70th National Film Award: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డ్ అందుకున్నాడు శ్రీపథ్. మరి ఈ శ్రీపథ్ ఎవరు, అతనికి నేషనల్ అవార్డ్ తీసుకొచ్చిన మాలికాపురం సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం.
(1 / 6)
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రావడం సినీ ఆర్టిస్టులకు పెద్ద డ్రీమ్. పిల్లలకు ఇంత పెద్ద అవార్డు రావడం చాలా అరుదు. అలాంటిది 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో శ్రీపథ్ అనే కుర్రాడు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యాడు.
(2 / 6)
శ్రీపథ్ అనేక మలయాళ చిత్రాలలో నటించాడు. వీటిలో మాలికపురం సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక అమ్మాయి శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని కలలు కంటుంది. ఆమె, ఆమె స్నేహితుడు కలిసి ఈ ప్రయాణాన్ని చేపడతారు.
(3 / 6)
ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన మాలికపురం చిత్రంలో బాలనటుడిగా శ్రీపథ్ నటించాడు. ప్రస్తుతం తన నటనకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. దేవానంద, శ్రీపథ్‌లు మలిగాపురంలో బాలలుగా నటించారు.
(4 / 6)
కన్నూరుకు చెందిన రాజేష్, రస్నా దంపతుల కుమారుడు శ్రీపథ్. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. టిక్ టాక్ వీడియోతో ఫేమస్ అయిన శ్రీపథ్ ఓ మ్యూజిక్ ఆల్బమ్, డాక్యుమెంటరీలో నటించి సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత కుమారిలో చోకన్ పాత్ర పోషించాడు. అనంతరం మాలికాపురం సినిమాలోో శ్రీపథ్ తన చమత్కారమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.
(5 / 6)
కేరళలోని కన్నూర్ కు చెందిన శ్రీపథ్ మాలికాపురం సినిమానే కాకుండా కుమారి, ఇబ్లిస్, సుమతి వలవు వంటి చిత్రాల్లో కూడా నటించాడు. మాలికాపురం సినిమా గతేడాది ఫిబ్రవరి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు