(1 / 7)
తెలంగాణలో ఈ మధ్య కాలంలో విడాకుల కేసులు బాగా పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 7 ప్రధాన అంశాలు.. భార్యభర్తలు విడిపోవడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం వలన తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం పెరిగింది. దీనితో వారు తమ వివాహ బంధంలో సంతోషంగా లేకుంటే విడాకులు తీసుకోవడానికి వెనుకాడటం లేదు.
(istockphoto)(2 / 7)
సమాజంలో మార్పులు రావడం వలన విడాకులను ఒకప్పుడులా తప్పుగా చూడటం లేదు. దీంతో విడాకులు తీసుకోవడం సులభం అయింది.
(istockphoto)(3 / 7)
భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలన అపార్థాలు, గొడవలు జరుగుతున్నాయి. ఇది విడాకులకు దారి తీస్తోంది.
(istockphoto)(4 / 7)
భార్యాభర్తల మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు, ఆసక్తులు వేరుగా ఉండటం వలన ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టం అవుతోంది.
(istockphoto)(5 / 7)
నేటి ఆధునిక జీవితంలో ఒత్తిడి ఎక్కువవడం వలన కుటుంబ జీవితంపై ప్రభావం పడుతోంది. దీంతో భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించలేకపోతున్నారు. ఇది కూడా విడాకులకు ఒక కారణం అవుతోంది.
(istockphoto)(6 / 7)
విడాకులు తీసుకోవడం సులభం చేసే విధంగా చట్టాల్లో మార్పులు వచ్చాయి. ఇది కూడా విడాకుల కేసులు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
(istockphoto)(7 / 7)
సాంకేతికత అభివృద్ధి చెందడం వలన ఒకరితో ఒకరు ఎక్కువగా కనెక్ట్ అవ్వడం లేదు. దీంతో ఒంటరితనం పెరుగుతోంది. ఇది కూడా విడాకులకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
(istockphoto)ఇతర గ్యాలరీలు