
(1 / 7)
పాములు పెరుగుతున్న కొద్దీ వాటి శరీరంపై ఉండే చర్మం చిన్నదైపోతుంది. ఈ చర్మాన్ని వదిలించుకోవడం ద్వారా అవి పెరుగుదలకు అనుగుణంగా కొత్త చర్మాన్ని పొందుతాయి.
(istockphoto)
(2 / 7)
కుబుసం విడవడం ద్వారా పాములు తమ శరీరంపై ఉండే పరాన్నజీవులను తొలగించుకుంటాయి. దీని ద్వారా వాటికి వ్యాధులు రాకుండా ఉంటాయి.
(istockphoto)
(3 / 7)
పాము చర్మానికి ఏవైనా గాయాలు లేదా నష్టం జరిగితే.. కుబుసం విడవడం ద్వారా వాటిని సరిచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
(istockphoto)
(4 / 7)
పాములకు స్వేద గ్రంథులు ఉండవు. అందువల్ల అవి తమ శరీరాన్ని చల్లబరచుకోవడానికి కుబుసంపై ఆధారపడతాయి.
(istockphoto)
(5 / 7)
చిన్న పాములు తరచుగా కుబుసం విడుస్తాయి, ఎందుకంటే అవి వేగంగా పెరుగుతాయి. పెద్ద పాములు నెలకు ఒకసారి లేదా రెండుసార్లు కుబుసం విడుస్తాయి.
(istockphoto)
(6 / 7)
కుబుసం విడువడానికి ముందు పాము చర్మం రంగు కొద్దిగా మందబారుతుంది. పాము కళ్లు నీలంగా లేదా పాలలాగా కనిపిస్తాయి. పాము తిన్న ఆహారం పరిమాణం, రకం కూడా కుబుసం విడువడాన్ని ప్రభావితం చేస్తాయి.
(istockphoto)
(7 / 7)
కుబుసం విడిచే సమయంలో పాములు కొద్దిగా బలహీనంగా ఉంటాయి. కుబుసం విడువడానికి ముందు పాములు చికాకుగా కూడా ఉండవచ్చు. అందువల్ల, ఈ సమయంలో వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం మంచిది.
(istockphoto)ఇతర గ్యాలరీలు