Kakatiya Kala Thoranam : కాకతీయ కళా వైభవానికి ప్రతీక.. ఓరుగల్లు కళాతోరణం గురించి 7 ఆసక్తికరమైన విషయాలు
- Kakatiya Kala Thoranam : వరంగల్ కాకతీయ కళాతోరణం.. తెలంగాణ చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అద్భుత నిర్మాణం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు.. కాకతీయ రాజవంశం ఘన చరిత్ర, కళాత్మక నైపుణ్యం, శిల్పకళా వైభవానికి నిదర్శనం. అంతటి ప్రాధాన్యం గల కాకతీయ కళాతోరణం గురించి 7 ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.
- Kakatiya Kala Thoranam : వరంగల్ కాకతీయ కళాతోరణం.. తెలంగాణ చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అద్భుత నిర్మాణం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు.. కాకతీయ రాజవంశం ఘన చరిత్ర, కళాత్మక నైపుణ్యం, శిల్పకళా వైభవానికి నిదర్శనం. అంతటి ప్రాధాన్యం గల కాకతీయ కళాతోరణం గురించి 7 ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.
(1 / 7)
వరంగల్ కాకతీయ కళాతోరణం.. 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. ఈ కళాతోరణం వరంగల్ కోటలోని శివాలయానికి ప్రవేశ ద్వారంగా ఉండేది. కాకతీయ రాజులు తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ అద్భుతాన్ని నిర్మించారు. వరంగల్ కోట నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను కలుపుతూ.. గణపతి దేవుడు ఖిల్లా వరంగల్ చుట్టూ 15 మీటర్ల ఎత్తయిన రాతి గోడను నిర్మించారు. ఈ గోడపై బురుజులు కూడా ఉన్నాయి. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు, కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు.
(unsplash)(2 / 7)
కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్ కాదు. దాని మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో ఈ తోరణాలు తెలియజేస్తాయి. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం.
(unsplash)(3 / 7)
హంసలు, మొసళ్లు, పద్మాలు, మొకలు, తలకిందులుగా వేలాడినట్టుండే తామెర మొగ్గల వంటి ఆకృతులు.. ఇలా ఎన్నో అంశాల కలబోత వరంగల్ కాకతీయ తోరణాలు. ఈ శిల్పాలు కాకతీయ శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనం.
(unsplash)(4 / 7)
కాకతీయుల ధైర్య సాహసాలకు నిదర్శనంగా ఈ కళాతోరణాలు నిలుస్తాయి. ఢిల్లీ సుల్తానులపై కాకతీయ సేనలు చేసిన యుద్ధం గురించి.. గొడిశాలలో ఉన్న కాకతీయుల కళాతోరణం తెలుపుతోంది.
(unsplash)(5 / 7)
ఈ కళాతోరణాలను వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించారని చరిత్ర చెబుతోంది. నాలుగు స్తంభాలు, రెండు వైపులా రెండేసి స్తంభాలు ఉన్నాయి. ఇది కాకతీయుల వాస్తు జ్ఞానానికి నిదర్శనం.
(unsplash)(6 / 7)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారిక చిహ్నంగా కాకతీయ కళాతోరణాన్ని ప్రకటించారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి ప్రతీక. వరంగల్ కాకతీయ కళాతోరణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక నిర్మాణాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
(unsplash)ఇతర గ్యాలరీలు