Telangana Tourism : యాదగిరిగుట్ట చరిత్ర, ప్రత్యేకతలు ఏంటీ? 7 ఆసక్తికరమైన అంశాలు
- Telangana Tourism : యాదగిరిగుట్ట తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. యాదగిరిగుట్ట చరిత్ర చాలా పురాతనమైనది. దీనికి మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. ఇక్కడికి తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.
- Telangana Tourism : యాదగిరిగుట్ట తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. యాదగిరిగుట్ట చరిత్ర చాలా పురాతనమైనది. దీనికి మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. ఇక్కడికి తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.
(1 / 7)
యాదగిరిగుట్ట తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. హాద ఋషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అందుకని ఆయన తపస్సు చేశాడు.
(2 / 7)
హాద ఋషి తపస్సుతో.. స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు హాదర్షి.. స్వామివారు ఎల్లప్పుడూ ఇక్కడే కొలువై ఉండాలని కోరాడు. అలా స్వామివారు యాదగిరిగుట్టలో కొలువై ఉంటానని హాదర్షికి వరం ఇచ్చారు. యాదవుడు అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల.. ఈ ప్రదేశానికి యాదగిరి అనే పేరు వచ్చిందని కూడా అంటారు.
(3 / 7)
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మొదట్లో ఒక చిన్న గుహలో ఉండేది. కాలక్రమేణా భక్తుల తాకిడి ఎక్కువవడంతో గుహను పెద్దదిగా చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం చాలా పెద్దది. అందంగా ఉంటుంది. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
(4 / 7)
యాదగిరిగుట్టలో మూడు రూపాల్లో స్వామివారు దర్శనమిస్తారు. ఒకటి ప్రహ్లాద చరిత్రకు సంబంధించినది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారు ప్రహ్లాదుడి కోరిక మేరకు ఉగ్రరూపాన్ని వదలి, ప్రసన్నరూపాన్ని ధరించి యాదగిరి గుట్టపై వెలిశాడు. అలా ప్రసన్న నరసింహస్వామి రూపంగానూ, యాదరుషికి దర్శనమిచ్చిన జ్వాలా నరసింహస్వామి రూపంగానూ, యాదగిరికి వచ్చే భక్తులను అనుగ్రహిస్తూ ఉండే లక్ష్మీ నరసింహ స్వామివారి రూపంలోనూ భక్తులకు దర్శనమిస్తుంటారు.
(5 / 7)
ఇక్కడ స్వామివారి పుష్కరిణికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనినే "విష్ణుకుండం" అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. అందుకే ఈ పవిత్ర జలాలలో ముందుగా స్నానమాచరించిన తరువాతే స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్తుంటారు.
(6 / 7)
యాదగిరిగుట్ట క్షేత్ర పాలకుడిగా ఆంజనేయస్వామి పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణశిలను ఎక్కువగా ఉపయోగించారు. ఆలయ గోపురాలు, మండపాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
(7 / 7)
యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు, ఇతర పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. హైదరాబాద్ నుంచి చాలా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఎక్కువమంది భక్తులు ఇక్కడికి వస్తారు
ఇతర గ్యాలరీలు