AP TG SSC Exams : పిల్లలకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. తల్లిదండ్రులు ఏం చేయాలి? 6 ముఖ్యమైన అంశాలు-6 precautions parents should take during exams for their children ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Ssc Exams : పిల్లలకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. తల్లిదండ్రులు ఏం చేయాలి? 6 ముఖ్యమైన అంశాలు

AP TG SSC Exams : పిల్లలకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. తల్లిదండ్రులు ఏం చేయాలి? 6 ముఖ్యమైన అంశాలు

Feb 03, 2025, 10:33 AM IST Basani Shiva Kumar
Feb 03, 2025, 10:33 AM , IST

  • AP TG SSC Exams : తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలకు సమయం ఆసన్నమైంది. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు అంటూ గడియ రికాం లేకుండా చదువుతున్నారు. అయితే.. ఈ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. పరీక్షా కాలంలో పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పరీక్షల కోసం సబ్జెక్టుల వారీ సన్నద్ధత, విరామానికి సంబంధించి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు టైం టేబుల్‌ తయారు చేయాలి. కావాల్సిన పుస్తకాలు, రిఫరెన్స్‌ మెటీరియల్, ఇతర సామాగ్రిని సేకరించేందుకు పిల్లలకు హెల్ప్ చేయాలి.

(1 / 6)

(istockphoto)

బ్రీఫ్ నోట్స్ తయారు చేయడంలో విద్యార్థులకు పేరెంట్స్ సాయం చేయాలి. వీటిపై అనుమానాలు ఉంటే.. ఇతరులతో చర్చించాలి. చిన్న చిన్న చిట్కాలు తెలుసుకొని.. పిల్లలు నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఆరోగ్యం, చదువు పరంగా ఏ సమస్యలున్నా ఇంట్లో చెప్పేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి.

(2 / 6)

పిల్లలకు అలసట దరిచేరకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయమే లేపి.. తేలికపాటి వ్యాయామాలు చేసేలా ప్రోత్సహించాలి. స్కూళ్లలో నిర్వహించే పరీక్షల్లో చూపిన ప్రతిభను గుర్తించి.. అభినందించాలి. వారిలో ఉత్సాహాన్ని నింపడానికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి. 

(3 / 6)

విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చవద్దు. అలా చేస్తే వారి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇతరులపై ఈర్ష్య పెరుగుతుంది. చిన్న విజయాలను కూడా సెలబ్రేట్‌ చేయాలి. చదువులో మెరుగయ్యేలా ప్రోత్సహించాలి. ర్యాంకులు, మార్కులే లక్ష్యంగా కాకుండా.. ప్రతిభ చూపడం ముఖ్యమనే ఆలోచన కలిగించాలి.

(4 / 6)

పిల్లల జీవితంలో ఓ భాగమే. పరీక్షలే వారి జీవితమనేలా వ్యవహరించొద్దు. వేరేవారి పిల్లలు బాగా చదువుతున్నారనో, లక్షల్లో, వేలల్లో ఫీజులు చెల్లించామనో మందలించొద్దు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. 

(5 / 6)

తోటి విద్యార్థులతో కాసేపు ఆడుకునేలా చూడాలి. సెలవు రోజుల్లో బంధుమిత్రుల ఇళ్లకు తీసుకెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపేలా చూడాలి. దీనివల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుంది, చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు