(1 / 6)
రామప్ప ఆలయాన్ని 1213 సంవత్సరంలో.. కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. రేచర్ల రుద్రుడు అనే శిల్పి ఈ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామికి అంకితం చేశారు. ఈ ఆలయం ప్రధాన శిల్పి పేరు మీద.. రామప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
(2 / 6)
రామప్ప ఆలయం అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి. ఆలయం మొత్తం వివిధ దేవతల శిల్పాలతో అలంకరించి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు మద్దెలు వాయిస్తూ నృత్యం చేస్తున్న శిల్పాలు.. ప్రత్యక ఆకర్షణగా నిలుస్తాయి.
(3 / 6)
ఆలయం నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం.
(4 / 6)
ఆలయంలోని శిల్పాలు చాలా సూక్ష్మంగా చెక్కబడి ఉన్నాయి. సూది మొనంత సన్నని రంధ్రాలు కూడా శిల్పాలలో కనిపిస్తాయి. ఇది అప్పటి శిల్పకళకు నిదర్శనం.
(5 / 6)
ఈ ఆలయం ప్రాముఖ్యతను యునెస్కో గుర్తించింది. 2021లో రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. నిధులు కేటాయిస్తోంది.
(6 / 6)
చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారికి రామప్ప ఆలయం మంచి ఎంపిక. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం మనస్సుకు ప్రశాంతను ఇస్తుంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించడాన్ని చాలామంది అదృష్టంగా భావిస్తారు.
ఇతర గ్యాలరీలు