Kaleshwaram Temple : నాలుగు దిక్కులా నంది విగ్రహాలు, ధ్వజస్తంభాలు, గోపురాలు.. కాళేశ్వరం ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు!
- Kaleshwaram Temple : తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం ఉంది. దీనినే కాళేశ్వరం ఆలయం అని కూడా అంటారు. కాళేశ్వరం ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయ విశిష్టతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 6)
పూర్వం ఈ ప్రాంతాన్ని కాళేశ్వరపురం అనే పిలిచేవారు. ఇక్కడ కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అనే రెండు శివలింగాలు ఒకే పానవట్టంపై కొలువై ఉండటం విశేషం. ముక్తీశ్వరుడు దర్శనం చేసుకొనే భక్తులకు మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. అందుకే యముడు ఇక్కడ లింగాకారంలో శివుని పక్కనే స్థానం పొందాడు అని స్థల పురాణం చెబుతోంది.
(2 / 6)
పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఈ ఆలయంలో ఉండేవారని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 1170లో రుద్ర శివలింగాన్ని కాకతీయ వంశస్థుడు నిర్మించారు. ఈ దేవాలయం చోళ, కాకతీయ రాజవంశాల కాలంలో నిర్మించినట్టు తెలుస్తోంది.
(3 / 6)
కాళేశ్వరం ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం సమీపంలోనే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు.. అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. దీనికి సమీపంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.
(4 / 6)
ఈ ఆలయం గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు ఉంటాయి. ఇదీ కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత. వేరే ఎక్కడా శివాలయంలో ఇలా ఉండదు.
(5 / 6)
దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ప్రతిఏటా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
ఇతర గ్యాలరీలు