
(1 / 6)
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు.. 1974 ఫిబ్రవరి 1న ప్రారంభం అయ్యింది. కానీ అప్పుడు వాల్తేరు-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభించారు. ప్రారంభంలో ఈ రైలు విశాఖపట్నం నుండి సాయంత్రం 5:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ చేరుకునేది.
(unsplash)
(2 / 6)
గోదావరి నది పరివాహక ప్రాంతాల మీదుగా వెళ్తున్నందున.. చాలాకాలం తర్వాత గోదావరి ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చారు. 2011లో ఈ రైలు సూపర్‌ఫాస్ట్ హోదా పొందింది. 2020 జూన్ 1 నుంచి ఇది ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో నడుస్తోంది.
(unsplash)
(3 / 6)
ఈ రైలు హైదరాబాద్ డెక్కన్ నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణిస్తుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది. హైదరాబాద్‌లో బయల్జేరి.. సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది.
(unsplash)
(4 / 6)
ఈ రైలు విశాఖపట్నంలో సాయంత్రం 05:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హాదరాబాద్‌లో సాయంత్రం 05:05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 05:55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
(unsplash)
(5 / 6)
ఈ రైలులో వివిధ తరగతుల కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ అన్‌రిజర్వ్‌డ్ బోగీలు ఉంటాయి. పాంట్రీ కార్ లేదు. కానీ ఈ-కేటరింగ్, ఆన్-బోర్డ్ కేటరింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
(unsplash)
(6 / 6)
ఇది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. సగటు ప్రయాణ సమయం సుమారు 12 గంటల 50 నిమిషాలు ఉంటుంది. ప్రయాణ దూరం సుమారు 709 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. రాత్రిపూట జర్నీ కావడంతో.. హైదరాబాద్- విశాఖ మధ్య ప్రయాణించేవారు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
(unsplash)ఇతర గ్యాలరీలు