నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?-6 important points on how farmers can identify fake seeds ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

Published May 23, 2025 06:47 PM IST Basani Shiva Kumar
Published May 23, 2025 06:47 PM IST

వానాకాలం సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని రోజుల్లో పంటలు వేయడం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో నకిలీ విత్తనాలతో అన్నదాతలు మోసపోయారు. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి విత్తన ప్యాకెట్‌పై ప్రభుత్వ ధృవీకరణ ట్యాగ్ ఉందో లేదో తనిఖీ చేయాలి. ఇది నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. విత్తనం నాణ్యతను సూచిస్తుంది. ప్యాకెట్‌పై విత్తనం రకం, లాట్ నంబర్, గడువు తేదీ, ఇతర ముఖ్యమైన వివరాలు స్పష్టంగా ముద్రించబడి ఉండాలి. అదే నాణ్యమైన విత్తనం.

(1 / 6)

(unsplash)

విత్తన ప్యాకెట్ సరిగ్గా సీల్ చేయబడి ఉందో లేదో చూడాలి. ట్యాంపర్ చేసినట్లు అనిపిస్తే కొనవద్దు. లైసెన్స్ కలిగిన డీలర్ల నుండి లేదా విశ్వసనీయమైన దుకాణాల నుండి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి.

(2 / 6)

కొనుగోలు చేసిన ప్రతిసారి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. దానిపై డీలర్ సంతకం, కొనుగోలు చేసిన తేదీ ఉందో లేదో చెక్ చేయాలి. విత్తనాలు ఒకే పరిమాణంలో, ఆకారంలో ఉండాలి. వాటి రంగు, వాసనలో ఏదైనా తేడా ఉంటే వాటిని కొనవద్దు. అవి నకిలీ విత్తనాలు కావొచ్చు.

(3 / 6)

నకిలీ విత్తనాలు నాణ్యత లేనివి కావడం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. కొన్నిసార్లు నకిలీ విత్తనాలు మొలకెత్తకపోవచ్చు. తెగుళ్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది పంట పూర్తిగా నష్టపోవడానికి దారితీస్తుంది.

(4 / 6)

నకిలీ విత్తనాల వల్ల రైతులు నాటడానికి, పంటను సంరక్షించడానికి వెచ్చించిన సమయం, నీరు, ఎరువులు వంటి వనరులు వృధా అవుతాయి. పంట నష్టం వల్ల రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా తిరిగి రాదు.

(5 / 6)

నకిలీ వాటి కారణంగా.. రైతులు నాణ్యమైన విత్తనాలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ అంశాలను గుర్తుంచుకోవడం ద్వారా నకిలీ విత్తనాలను గుర్తించవచ్చు. నష్టపోకుండా ఉండవచ్చు. ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం మంచిది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు