(1 / 6)
మీరు రూ. 500కి ఇంధనం నింపమని చెప్తే.. సిబ్బంది మీ దృష్టిని మళ్లించి మీటర్‌ని రీసెట్ చేయకపోవచ్చు. పెట్రోల్ పోసే వ్యక్తి మెషీన్‌ను తరచుగా నిలిపివేస్తుంటే మోసం చేస్తున్నట్లు అనుమానించాలి. కొన్ని పెట్రోల్ బంకుల్లో చిప్స్ ఉపయోగించి, ఇంధనం తక్కువగా వచ్చేలా చేస్తారు.
(unsplash)(2 / 6)
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి పెట్రోల్ బంకులో కస్టమర్లు అడగకుండానే ఫిల్టర్ పేపర్లు ఇవ్వాలి. పేపర్‌పై రెండు చుక్కల అనుమానాస్పద పెట్రోల్ పోయాలి. మరక పడితే అది కల్తీ అని అర్థం.
(unsplash)(3 / 6)
కొన్ని పెట్రోల్ బంకుల్లో మీటర్లలో ట్యాంపరింగ్ చేసి, తక్కువ ఇంధనం ఇస్తారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో లీటర్‌కు 60 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా వచ్చేలా ట్యాంపరింగ్ చేస్తారు.
(unsplash)(4 / 6)
రౌండ్ ఫిగర్లో (రూ. 100, 200, 500) పెట్రోల్ కొట్టించడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బంది మీ దృష్టి మళ్లించి డబ్బులు మార్చడం, లేదా మీ వస్తువులను దొంగిలించడం లాంటివి కూడా చేస్తుంటారు.
(unsplash)(5 / 6)
ఇంధనం నింపుకునేటప్పుడు మీటర్ రీసెట్ అయ్యిందో లేదో గమనించాలి. పెట్రోల్ పోసేటప్పుడు మీటర్‌ను గమనిస్తూ ఉండండి. ఫిల్టర్ పేపర్ ఉపయోగించి ఇంధనాన్ని పరీక్షించండి. మీకు అనుమానం వస్తే, పెట్రోల్‌ను పరీక్షించమని బంక్ యజమానులను డిమాండ్ చేయండి.
(unsplash)ఇతర గ్యాలరీలు